ఆదివారం, 28 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 18 జులై 2022 (11:08 IST)

యానాంలో తగ్గని వరద ప్రమాదం.. నేడు రేపు సెలవులు

schools closed
నైరుతి రుతుపవనాల కారణంగా తెలంగాణా రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా విస్తృతంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో కొత్తగూడెం భద్రాచలం ఏరియాలోని అనేక ప్రాంతాలు నీట మునిగాయి. గోదావరి నది ఉప్పొంగి ప్రవహించడంతో ఏపీలోని గోదావరి పరివాహర ప్రాంతాల్లో కూడా వరద ముప్పు ఏర్పడింది. వీటిలో యానా పట్టణం కూడా వుంది. 
 
ఇక్కడ వరద నీరు ఇంకా ప్రవహిస్తుంది. దీంతో అప్రమత్తమైన అధికారులు ముందు జాగ్రత్త చర్యగా విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించారు. వరదల నేపథ్యంలో సోమ, మంగళవారాల్లో యానాంలోని అని స్కూళ్ళకు విద్యాశాఖ సెలవు ప్రకటించింది. యానాం రీజియన్‌లోని అన్ని ప్రభుత్వం, ప్రైవేటు, ఎయిడెడ్ పాఠశాలకు రెండు రోజుల పాటు సెలవు ఉంటుందని యానాం పరిపాలనా అధికారి శర్మ ఆదేశాలు జారీచేశారు.