సోమవారం, 6 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 13 జులై 2022 (15:21 IST)

తెలంగాణాలో మరో మూడు రోజుల పాటు సెలవులు?

schools closed
తెలంగాణ రాష్ట్రంలో మరోమూడు రోజుల పాటు విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించే అవకాశం ఉంది. గత కొన్ని రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ఆ రాష్ట్రంలోని అన్ని వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఈ క్రమంలో సోమవారం నుంచి బుధవారం వరకు అన్ని విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించారు. 
 
అయితే, మరో మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. అదీ కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు తెలిపింది. దీంతో ఈ గురువారం నుంచి తెరుచుకోవాల్సిన విద్యా సంస్థలకు మరో మూడు రోజులపాటు సెలవులు ప్రకటించే అవకాశం ఉంది. ఇదే అంశంపై బుధవారం సాయంత్రంలోపు అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.