ఆ రాష్ట్రంలో పాఠశాలలకు మూడు రోజుల సెలవు
తెలంగాణ రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ కారణంగా అనేక జిల్లాలోని వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. పైగా, వచ్చే మూడు రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమై, ముందు జాగ్రత్త చర్యగా విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించారు.
సోమవారం నుంచి బుధవారం వరకు సెలవులు ప్రకటిస్తూ ఆ రాష్ట్ర విద్యాశాఖ ఆదివారం ఆదేశాలు జారీచేసింది. మరోవైపు, రాష్ట్రంలో భారీ వర్షాల నేపథ్యలో మంత్రులు, అధికారులతో సీఎం కేసీఆర్ తన అధికారిక నివాసం ప్రగతి భవన్‌లో సమీక్షా సమావేశం నిర్వహించి, తీసుకోవాల్సిన చర్యలపై తగిన సూచనలు, సలహాలు ఇచ్చారు. అలాగే మంత్రులకు, అధికారులకు దిశానిర్దేశంచేశారు.