సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 13 జులై 2022 (16:55 IST)

తెలంగాణాలో మరో మూడు రోజులు విద్యా సంస్థలు బంద్

schools
తెలంగాణ రాష్ట్రంలో మరో మూడు రోజుల పాటు విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించారు. రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు.. పలుచోట్ల వరద పరిస్థితులు ఉండటంతో మరో మూడురోజులు సెలవులు పొడించాలని నిర్ణయించినట్లు సమాచారం. 
 
గతవారం రోజులుగా వర్షాలు కురుస్తున్నందున రాష్ట్రంలోని అన్ని విద్యాసంస్థలకు మూడురోజుల పాటు (సోమ, మంగళ, బుధవారం) సెలవులు ఇస్తున్నట్లు ఇటీవల ప్రభుత్వం ప్రకటించింది. 
 
ప్రభుత్వం తొలుత ప్రకటించిన విధంగా నేటితో సెలవుల గడువు ముగిసిపోనుండటంతో తాజాగా మరో మూడు రోజులు పొడిగించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. దీనిపై సాయంత్రానికి స్పష్టత వచ్చే అవకాశముంది.