సోమవారం, 20 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఐవీఆర్
Last Updated : మంగళవారం, 12 జులై 2022 (17:21 IST)

రొయ్యల్ని పట్టుకుంటుండగా ముక్కులో దూరిన రొయ్య... వామ్మో...

Prawn
రొయ్యలు, చేపలు... ఇలా ఏవైనా పట్టుకునేటపుడు జాగ్రత్తగా వుండాలి. ఏమాత్రం ఏమరపాటుగా వున్నా అవి ఏమయినా చేయగలవు. ఇక్కడ ఓ రొయ్య ఏకంగా రొయ్యల్ని పడుతున్న వ్యక్తి ముక్కులో దూరి ఉక్కిరిబిక్కిరి చేసింది.

 
వివరాల్లోకి వెళితే... ఏలూరు జిల్లా గణపవరంకి చెందిన ఓ వ్యక్తి రొయ్యలను పడుతున్నాడు. ఈ సమయంలో ఓ రొయ్య పైకి ఎగిరి అతడి ముక్కులో దూరింది. దానిని బయటకు లాగేందుకు ఎంత ప్రయత్నించినా అది రాలేదు. దీనితో ఊపిరి ఆడక అతడు ఉక్కిరిబిక్కిరయ్యాడు.

 
వెంటనే సమీప ఆసుపత్రికి తరలించారు. అతడిని పరీక్షించిన వైద్యులు వెంటనే చికిత్స చేసి రొయ్యను జాగ్రత్తగా అతడి ముక్కు నుంచి బయటకు తీసారు. దాంతో అతడికి ప్రాణం లేచివచ్చినంత పనైంది.