Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెరుచుకోని టిటిడి వెబ్ సైట్, ఇంటర్నెట్ సెంటర్ల వద్ద భక్తుల పడిగాపులు

Written By జె
Updated: బుధవారం, 28 జులై 2021 (18:29 IST)
ఆగష్టు నెలకు సంబంధించిన దర్సన టోకెన్లు విడుదలైపోయాయి. హాట్ కేకుల్లా భక్తులు టోకెన్లను పొందారు. అయితే కొన్ని టోకెన్లు మిగిలాయి. 3వేల టోకెన్లు దాకా ఉన్నాయి. ఆగష్టు 31వ తేదీ వరకు ఈ టోకెన్లు 3 వేలు దాకా ఉన్నట్లు టిటిడి తెలిపింది. కావాల్సిన భక్తులు ఈరోజు ఉదయం 11 గంటలకు ఆన్ లైన్లో బుక్ చేసుకోవచ్చని చెప్పింది.
 
దీంతో భక్తులు స్వామవారి దర్సన టోకెన్ల కోసం తిరుపతి బాలాజీ ఎపి.జిఓవి.ఇన్ వెబ్ సైట్‌ను ఓపెన్ చేశారు. ఇంటర్నెట్ సెంటర్ల వద్ద టోకెన్ల పొందేందుకు భక్తులు బారులు తీరారు. చాలాసేపటి వరకు ఆ సైట్ ఓపెన్ కాలేదు. సుమారు గంటపాటు శ్రమించి చివరకు భక్తులు నిరాశకు గురయ్యారు.
 
అయితే మధ్యాహ్నం 1 గంట తరువాత టిటిడి మరోసారి ఒక ప్రకటన విడుదల చేసింది. భక్తులెవరూ నిరాశకు గురికావాల్సిన అవసరం లేదు. మధ్యాహ్నం 3 గంటలకు రిలీజ్ అవుతుందని తెలిపింది. అయినా కూడా సైట్ ఓపెన్ కాలేదు. 
 
ఆఫ్ లైన్లో టిక్కెట్లు ఆగిపోవడం.. కనీసం ఆన్ లైన్లోనైనా టోకెన్లు పొంది స్వామివారి దర్సనం పొందాలనుకుంటున్న శ్రీవారి భక్తులు సైట్ ఓపెన్ కావడంతో చాలా ఇబ్బందులు పడుతున్నారు. అయితే టోకెన్లు విడుదల చేసే తిరుపతిలోని ఇడిపి కార్యాలయంలో సాంకేతిక లోపమే కారణమని తెలుస్తోంది. 

అన్నీ చూడండి

ప్రభాస్ చిత్రం పౌర్ణమిలోని తెలుగు పాటకు చైనీస్ నర్తకి నాట్యం ట్రెండింగ్ వీడియో

మమ్ముట్టి మూవీ ‘ఓం: చాప్ట‌ర్‌1-ఉధిరం’ నుంచి వీడియో గ్లింప్స్

Fauzi Update: పోస్ట్‌ప్రొడక్షన్‌తో ఫౌజీ స్పీడ్.. షూటింగ్‌కు బ్రేక్ ఇచ్చిన ప్రభాస్ ?

Sumanth: పవన్ కళ్యాణ్ గారికి వారాహి పాజిటివ్‌గా హెల్ప్ అయింది : సుమంత్

Anaswara Rajan look: కాకా చిత్రానికి అనస్వర రాజన్ హృదయం అని కితాబు

తర్వాతి కథనం
Show comments