మంగళవారం, 7 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 1 ఏప్రియల్ 2024 (12:31 IST)

అడవి చెట్టు నుంచి 20 లీటర్ల నీరు.. వీడియో నెట్టింట వైరల్

Video of water from wild tree
Video of water from wild tree
అడవి చెట్టు కొమ్మ నుండి నీరు ప్రవహిస్తున్న వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కింటుకూరు అటవీ ప్రాంతంలోని పాపికొండలు జాతీయ ఉద్యానవనంలో ఈ వీడియో తీయబడింది. ఇక్కడ కొంతమంది అటవీ అధికారులు నల్ల మద్ది చెట్టు నుంచి నీళ్లు రావడం చూశారు. ఈ చెట్టు నుంచి సుమారు 20 లీటర్ల నీరు వచ్చినట్లు అధికారులు తెలిపారు.
 
దక్షిణ, ఆగ్నేయాసియాకు చెందిన ఈ చెట్టు భారతదేశం, నేపాల్, బంగ్లాదేశ్, మయన్మార్, థాయిలాండ్, లావోస్, కంబోడియా, వియత్నాం వంటి దేశాలలో కనిపిస్తుంది.
 
 వృక్షశాస్త్రజ్ఞుల అభిప్రాయం ప్రకారం, చెట్టు తన ట్రంక్‌లో నీటిని నిల్వ చేసే విచిత్రమైన లక్షణాన్ని కలిగి ఉంది. 
 
ఈ నీరు త్రాగడానికి యోగ్యమైనది. ఈ నీటిలో ఔషధ గుణాలు వున్నాయని.. ఈ నీళ్లు కడుపు నొప్పిని నయం చేయడంలో సహాయపడతాయని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. ఈ వృక్షం చెక్కను వాయిద్యాలను తయారు చేయడానికి ఉపయోగిస్తారు.