గురువారం, 5 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఐవీఆర్
Last Updated : మంగళవారం, 29 అక్టోబరు 2024 (20:37 IST)

విజయసాయి, వైవీగారు మీడియాలో అవాస్తవాలు మాట్లాడారు: విజయమ్మ లేఖ

sharmila Reddy-Vijayamma
వైఎస్ జగన్-వైఎస్ షర్మిల ఆస్తులకు సంబంధించి మీడియాలో ఎవరికి తోచినట్లు వారు మాట్లాడుతున్నారని వైఎసార్ సతీమణి వైఎస్ విజయమ్మ ఆవేదన వ్యక్తం చేసారు. ఆస్తుల పంపకంపై వాస్తవాలు ఏమిటో బహిరంగ లేఖ ద్వారా తెలియజేసారు. ఆస్తుల పంపకం అనేది జరగలేదని తేల్చి చెప్పారు. 
 
విజయసాయిరెడ్డి గారు ఆడిటర్ గా వున్నారు కాబట్టి ఆయనకు అన్నీ తెలుసనీ, వైవీ సుబ్బారెడ్డిగారు మా ఇంటి బంధువుగా ఎంవోయుపై సంతకం కూడా చేశారు. కానీ మీడియాలో అవాస్తవాలు మాట్లాడటం తనకు చాలా బాధ కలిగించిందని తెలిపారు. వైఎస్సార్ కోరింది ఒకటే... ఆస్తుల పంపకం జగన్-షర్మిలకు సమంగా పంచాలన్నది. ఇప్పటివరకూ అసలు ఆస్తుల పంపకమే జరగలేదు.
 
నాకు నా ఇద్దరు బిడ్డలు సమానమే. ఒకరు ఎక్కువ మరొకరు తక్కువ కాదు. ఐతే అన్యాయం జరుగుతున్నవారికి న్యాయం చేయడం నా ధర్మం కనుక షర్మిలకు చెందాల్సినది చెంది తీరాల్సిందేనని ఆమె వెల్లడించారు. ఈ విషయంలో మూడో వ్యక్తి జోక్యం అవసరంలేదనీ, వాళ్లిద్దరూ అన్నాచెల్లెళ్లు కనుక వాళ్లే తేల్చుకుంటారనీ, ఈ విషయంలో ఎవరూ ఏమీ మాట్లాడవద్దని అభ్యర్థిస్తున్నట్లు ఆమె విన్నవించారు.