శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శనివారం, 26 జూన్ 2021 (19:33 IST)

రూ.600 కోట్లతో మోడ‌ల్ న‌గ‌రంగా విజ‌య‌వాడ‌

క‌ష్ట కాలంలో కూడా సీఎం జ‌గ‌న‌న్న సంక్షేమ అభివృద్ది అంటూ విజ‌య‌వాడ న‌గ‌రాభివృద్దికి ఆరు వంద‌ల కోట్ల రూపాయ‌లు కెటాయించార‌ని.. విజ‌య‌వాడ‌ను మోడ‌ల్ న‌గ‌రంగా అభివృద్ది చేస్తామ‌ని దేవ‌దాయ ద‌ర్మ‌దాయ శాఖ మంత్రి వెలంప‌ల్లి శ్రీ‌నివాస‌రావు పేర్కొన్నారు. 
 
శ‌నివారం 49వ డివిజన్  ఫ్రైజరుపేట తెలుగు బాప్టిస్టు చర్చి వద్ద రూ.40 లక్షల అంచనా వ్యయంతో యు.జీ.డీ పనులుకు, ఎర్ర‌క‌ట్ట డౌన్ రాజ‌రాజేశ్వ‌ర‌పేట లో 15 ల‌క్ష‌ల రూపాయ‌ల‌తో సి.సి రోడ్డు నిర్మాణ ప‌నుల‌కు మంత్రి  వెలంపల్లి శ్రీనివాసరావు శంఖుస్ధాపన మరియు 48వ డివిజను చిట్టినగర్ సొరంగం కొండ ప్రాంతములో రూ1.25 కోట్లతో నిర్మించిన 455 కె.ఎల్ సామర్ద్యం కలిగిన GSLR వాటర్ ట్యాంకును యం.ఎల్.సి క‌రీమున్నీసా,  నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, కమిషనర్ ప్రసన్న వెంకటేష్ తో కలసి ప్రారంభించారు. 
 
అనంత‌రం స్థానికుల‌తో మ‌ట్లాడారు... ఎర్ర‌క‌ట్ట డౌన్ లో పార్క్ ఖాళీ స్థ‌లంలో స్థానికులు వివిధ కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించుకునేందుకు గాను రేకుల షేడ్ నిర్మించ‌వ‌ల‌సిందిగా కోరారు.. స్పందించిన మంత్రి అధికారుల‌ను అంచ‌నాలు త‌యారు చేయాల‌ని అదేశించారు.  విజయవాడ నగర అభివృద్ధికి చిత్తశుద్ధితో కట్టుబడి ఉన్నామన్నారు.

తాము అధికారంలోకి వచ్చిన నాటి నుండి విజయవాడ నగరాన్ని మోడల్ నగరంగా తీర్చిదిద్దుతున్నమని, ఇప్పటికే ఆరు వందల కోట్లతో నగర వ్యాప్తంగా వివిధ అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని  మంత్రి వెల్లంపల్లి చెప్పారు..పనికిమాలిన జనసేన పార్టీ నాయకులు చేసిన ఆరోపణలకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదన్నారు.

వారికి ప్రజలలో ఎటువంటి ఆదరణ లేకపోవడంతో ఇటువంటి ఆరోపణల చేస్తున్నార‌ని అన్నారు.  
మేయ‌ర్ మాట్లాడుతూ న‌గ‌రాభివృద్దితో పాటు న‌గ‌ర ప్ర‌జ‌ల‌కు అన్ని సౌక‌ర్యాల క‌ల్ప‌నే ముఖ్య ద్యేయ్యంగా జ‌గ‌న‌న్న ప్ర‌భుత్వం ప‌నిచేస్తుందన్నారు.