శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శుక్రవారం, 18 జూన్ 2021 (07:38 IST)

పరిశుభ్ర‌ న‌గ‌రంగా విజ‌య‌వాడ

విజ‌య‌వాడలో ప్రతి ఇంటి నుంచి తడి, పొడి వ్యర్థాలు వేర్వేరుగా సేకరణకు చ‌ర్య‌లు చేప‌ట‌నున్న‌ట్లు  న‌గ‌ర పాలక సంస్థ క‌మిష‌న‌ర్ ప్ర‌స‌న్న వెంక‌టేష్ తెలిపారు.  దీంతో న‌గ‌రం 100 శాతం పరిశుభ్రంగా రూపుదిద్దుకోనున్నాయి.

తద్వారా ప్రజారోగ్యం మరింత మెరుగుపడనుంది. పరిశుభ్రతే లక్ష్యంగా క్లీన్ విజ‌య‌వాడ  (క్లాప్‌) ల‌క్ష్యంగా  న‌గ‌రంలో  స్పెష‌ల్ శానిటేష‌న్ డ్రైవ్ కు ఆరు డివిజ‌న్లు ఎంపిక  చేయ‌డం జ‌రిగింద‌ని అందులో భాగంగా శుక్ర‌వారం 4. 8, 10,12,13 డివిజ‌న్లు క‌మిష‌న‌ర్  అధికారుల‌తో క‌లిసి ప‌ర్య‌టించారు. క్లాప్‌ కార్యక్రమంలో ప్రభుత్వం పారిశుధ్య కార్మికులకు అత్యధిక ప్రాధాన్యమిస్తోంద‌న్నారు. 

నగరాలు, పట్టణాల్లో రోడ్లు, వీధుల్లో వ్యర్థాలు కనిపించకూడదన్నది క్లాప్‌ కార్యక్రమం లక్ష్యం అన్నారు.. అందుకు ఇంటింటి నుంచి వ్యర్థాలను సేకరిస్తారు. ఇళ్ల నుంచే తడి, పొడి, ప్రమాదకర వ్యర్థాలను వేర్వేరుగా సేకరిస్తారు.

ఆ విషయంపై వార్డు సచివాలయాల సిబ్బంది, వలంటీర్లు, స్వచ్ఛందసంస్థల ద్వారా ప్రజలకు అవగాహన కల్పిస్తున్న‌ట్లు వివ‌రించారు.తడిచెత్త కోసం పచ్చరంగు, పొడిచెత్త కోసం నీలం రంగు, ప్రమాదకర చెత్త కోసం ఎర్ర రంగు డస్ట్ బిన్‌లను సరఫరా చేస్తామ‌న్నారు. 

ఇళ్ల నుంచి వ్యర్థాల తరలింపునకు  ఆటోలను ప్రవేశపెడతారు. ఈ  ఆటోలకు  జీ.పీ.ఎస్‌ ట్రాకింగ్‌తో పాటుగా  రెండు వైపులా కెమెరాలు ఏర్పాటు చేస్తారు. దీంతో ఏ ఆటో ఏ ప్రాంతంలో ఉందో అధికారులు పర్యవేక్షస్తార‌న్నారు.