బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : బుధవారం, 23 జూన్ 2021 (22:50 IST)

24వ తేదీన విజయవాడలో కోవిషీల్డ్ వ్యాక్సినేష‌న్

విజయవాడలో ఉన్న 12 శాశ్వ‌త వ్యాక్సినేష‌న్ కేంద్రాల్లో గురువారం కోవిషీల్డ్ వ్యాక్సినేష‌న్  మొద‌టి / రెండోవ  డోస్ టీకా ఇవ్వ‌నున్నారు.

5150 కోవిషీల్డ్ వ్యాక్సినేష‌న్  అందుబాటులో ఉన్నవని,  అన్ని కేంద్రములలో ప్రత్యేక కౌంటర్ల ద్వారా 60 సంవత్సరాల పైబడిన వారికీ మరియు ఐదేళ్లలోపు చిన్నారులున్న తల్లులందరికీ వ్యాక్సినేషన్ నిర్వహింప బడుతున్నది.

అదే విధంగా 45 సంవ‌త్స‌రాలు నిండిన వారికి  మొద‌టి / రెండోవ డోస్‌గా  టీకా వేయ‌నున్నందున అర్హ‌లు మాత్ర‌మే వ్యాక్సినేష‌న్ కేంద్రాల‌కు వెళ్లాలన్నారు.

ప్రతి ఒక్కరు విధిగా తమ యొక్క అధార్ కార్డు తీసుకువెళ్లాల‌న్నని, మాస్క్ వినియోగం, భౌతిక దూరం  పాటించాలన్నారు.