ఆదివారం, 1 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్
Last Updated : బుధవారం, 14 డిశెంబరు 2022 (12:10 IST)

బంగాళాఖాతంలో అల్పపీడనం.. వారాంతంలో మరోటి ఏర్పడే ఛాన్స్..

rain
ఇటీవల సంంభవించిన మాండస్ తుఫాను దాటికి తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు అతలాకుతలమయ్యాయి. ఇది తీరం దాటి బలహీనపడినప్పటికీ ఆ ప్రభావం మాత్రం ఇంకా తగ్గిపోలేదు. ఫలితంగా కోస్తాంధ్రతో పాటు రాయలసీమ, ఉత్తర తమిళనాడు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. అలాగే, తెలంగాణాలోని కొన్ని ప్రాంతాల్లో వర్షం పడుతుంది. ఈ నేపథ్యంలో బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడింది.  
 
ఆగ్నేయ అరేబియా సముద్రంలో మంగళవారం ఏర్పడిన అల్పపీడనం బుధవారం తీవ్ర అల్పపీడనంగా మారుతుందని వాతావరణ శాఖ తెలిపింది. అంతేకాకుండా, ఇది మరింతగా బలపడి గురువారానికి తూర్పు మధ్య అరేబియా సముద్రంలో వాయుగుండంగా మారే అవకాశం ఉందని వెల్లడించింది. 
 
ఇదిలావుంటే, బంగాళాఖాతంలో దక్షిణ అండమాన్ సమీపంలని సుమిత్ర జలసంధిపై ఉపరితల ఆవర్తనం ఏర్పడివుంది. ఇది వచ్చే రెండు మూడు రోజుల్లో పశ్చిమంగా పయనించి శ్రీలంకకు సమీపంలో ఈ వారాంతంలో అల్పపీడనంగా రూపాంతరం చెందే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ అంచనా వేసింది.