శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : గురువారం, 23 ఏప్రియల్ 2020 (16:54 IST)

గుంటూరులో హోల్‌సేల్‌ కూరగాయల వ్యాపారం బంద్‌

గుంటూరులో గురువారం నుంచి హోల్‌సేల్‌ కూరగాయల వ్యాపారం నిలిపివేస్తున్నట్లు డాక్టర్‌ కొల్లి శారదా హోల్‌సేల్‌ కూరగాయల మార్కెట్‌ వ్యాపారుల సంఘ అధ్యక్షుడు యర్రంశెట్టి సత్యనారాయణ తెలిపారు. 
 
బస్టాండ్‌ దగ్గర ఉన్న మార్కెట్‌ను బుడంపాడు బైపాస్‌ వద్దకు తరలించారన్నారు. రెండు రోజులుగా గుంటూరులోకి వెళ్లే అన్ని రహదారులను మూసివేశారని తెలిపారు.

దీంతో కొనుగోలు చేసేవారు రాక మార్కెట్‌లో కూరగాయలు భారీగా నిల్వ ఉండి నష్టపోతున్నామన్నారు. గుంటూరులోకి కూరగాయల వాహనాలను తరలించే అవకాశం లేకపోవడం, రహదారుల మూతతో హోల్‌సేల్‌ వ్యాపారం చేయలేక బంద్‌ చేస్తున్నట్లు తెలిపారు.