గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 8 అక్టోబరు 2024 (10:48 IST)

అత్తాకోడళ్ల వివాదం.. కోడలు చెవిని కొరికేసింది.. అత్త చెవి ఊడిపోయింది..

Woman
అత్తా కోడళ్ల వివాదం మామూలుగా వుండదు. అలాంటిది అత్తతో గొడవపడిన కోడలు.. ఏకంగా అత్త చెవిని కొరికేసింది. ఈ ఘటన ఏపీలో వెలుగులోకి వచ్చింది. గుంటూరు జిల్లా తుళ్లూరులో నివసిస్తున్న కంభంపాటి శేషగిరి, పావని (30) దంపతులకు ఇద్దరు కుమారులు.. కొన్ని రోజులుగా కోడలు పావనికి అత్త నాగమణి (55) కి కుటుంబ కలహాల కారణంగా వివాదం నడుస్తోంది. 
 
ఈ క్రమంలో పావని, నాగమణికి ఆదివారం రాత్రి గొడవ జరిగింది. ఇద్దరి మధ్య వాగ్వాదం తారాస్థాయికి చేరింది.. దీంతో కొడలు పావని క్షణికావేశంలో అత్త నాగమణి చెవిని కొరికింది. దీంతో నాగమణి చెవి భాగం మొత్తం ఊడిపోయింది. 
 
వెంటనే ఆమె కుటుంబ సభ్యులు నాగమణిని తెగిన చెవితోపాటు తుళ్లూరు పీహెచ్‌సీకి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం అక్కడి నుంచి గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కానీ చెవిని అతుక్కోవడం కష్టమని వైద్యులు తేల్చి చెప్పేశారు. ఈ ఘటనపై ఇంకా కేసు నమోదు కాలేదు.