మంగళవారం, 31 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By ఐవీఆర్
Last Modified: శనివారం, 5 అక్టోబరు 2024 (16:59 IST)

భర్తతో విడిగా వుంటున్న స్నేహితురాలిపై కన్ను, అందుకు అంగీకరించలేదని హత్య

victim
హైదరాబాద్ నగరంలోని మియాపూర్ లో సీబీఆర్ ఎస్టేట్స్ లో సాఫ్ట్వేర్ ఉద్యోగిని స్పందనను ఆమె చిన్ననాటి స్నేహితుడే దారుణంగా హతమార్చినట్లు పోలీసులు ధృవీకరించారు. సెప్టెంబరు 30న స్పందనపై విచక్షణా రహితంగా దాడి చేసి హతమార్చాడు. తొలుత ఆమె హత్యను అనుమానాస్పద హత్యగా నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తులో దోషిగా ఆమె చిన్ననాటి స్నేహితుడని తేల్చారు.
 
పూర్తి వివరాలు చూస్తే... సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్న స్పందన తను నివాసం వుంటున్న సమీపంలోనే ఓ వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకున్నది. అతడు తరచూ వేధింపులకు గురిచేస్తున్నాడని, 2023లో విడాకులకు దరఖాస్తు చేసుకున్నది. ఆ కేసు విచారణలో వున్నది. స్పందన భర్తతో దూరంగా వుండి తన తల్లివద్దే వుంటూ ఉద్యోగం చేస్తోంది. ఇదే అదనుగా చేసుకుని ఆమె బాల్య స్నేహితుడు మనోజ్ కుమార్ తరచూ వారి ఇంటికి వెళ్లడం ప్రారంభించాడు.
 
వారికి చేదోడువాదోడుగా వుంటూ అవసరమైన పనులన్నీ చేస్తూ వచ్చాడు. ఈమధ్య కాలంలో స్పందనతో తనను పెళ్లి చేసుకోవాలని కోరాడు. అందుకు ఆమె ససేమిరా అంగీకరించలేదు. ఈ విషయమై ఆమెతో పలుమార్లు వాగ్వాదం చేసాడు. ఎంతకీ ఆమె అంగీకరించకపోవడంతో ఆమెను అతి కిరాతకంగా హత్య చేసి అక్కడి నుంచి పరారయ్యాడు.