ఆదివారం, 1 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజ‌య‌వాడ‌ , బుధవారం, 6 అక్టోబరు 2021 (12:28 IST)

విశాఖ ఎయిర్ పోర్ట్ లో... ఆమె బ్యాగులో బులెట్లు... ఎక్క‌డివి?

విశాఖ విమానాశ్రయంలో గన్ బుల్లెట్ కలకలం రేపాయి. విశాఖ విమానాశ్రయంలో ఒక మహిళ హ్యాండ్ బ్యాగులో 13 గన్ బుల్లెట్లు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వెంటనే ఎయిర్పోర్ట్ జోన్ పోలీసులకు సమాచారం అందించారు. 
 
విశాఖ ప్రాంతానికి చెందిన ఆ మహిళ తాను విశాఖపట్నం నుంచి హైదరాబాద్ వెళ్లడం కోసం ఎయిర్ పోర్టుకు చేరుకుంది. ఇమిగ్రేషన్ తనిఖీలలో ఆమె బ్యాగ్ లో 13 బుల్లెట్లు ఉన్నట్లు ఎయిర్పోర్ట్ అధికారులు గుర్తించారు. వెంట‌నే వాటిని సీజ్ చేసి, అవి ఆమెకు ఎక్క‌డి నుంచి వ‌చ్చాయి, హైద‌రాబాదుకు వాటిని ఎందుకు త‌న‌తో తీసుకెళుతోంద‌నే ప్ర‌శ్న‌లు సంధించారు. ఆమె ప్ర‌యాణాన్ని నిల‌పివేసి, పోలీసులు ప్ర‌శ్నిస్తున్నారు. పూర్తి విచార‌ణ జ‌రిపిన త‌ర్వాతే వివ‌రాలు అందించ‌గ‌ల‌మ‌ని ఎయిర్పోర్ట్ పోలీసులు చెపుతున్నారు.