బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 3 అక్టోబరు 2021 (11:02 IST)

మహిళలను బట్టల్లా మార్చే వ్యక్తులపై దయ చూపొద్దు : కంగనా రనౌత్

మహిళలను బట్టల్లా మార్చే వ్యక్తుల పట్ల ఏమాత్రం దయ చూపొద్దంటూ అంటూ బాలీవుడ్ నటి కంగనా రనౌత్ అన్నారు. టాలీవుడ్ జంట నాగ చైతన్య, సమంతలు తమ వైవాహిక బంధానికి ఫుల్‌స్టాఫ్ పెట్టాలని నిర్ణయించుకున్న విషయం తెల్సిందే. 
 
దీనిపై కంగనా రనౌత్ స్పందించారు. తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ‘విడాకుల సంస్కృతి’, అది ఎలా పెరుగుతోంది అనే దానిపై వ్యాఖ్యానించింది. 'మహిళలను బట్టల్లా మార్చే వ్యక్తుల పట్ల దయ చూపడం మానేయండి' అని ప్రజలను కోరింది. 
 
ఈ ఆకతాయిలు అభిమానుల నుండి ప్రశంసలు అందుకోవడం సిగ్గుచేటు అని కూడా ఈ నటి పేర్కొన్నారు, అయితే రిలేషన్‌లో ఉన్నప్పుడు మహిళ గురించే ఎప్పుడూ తీర్పులు చెబుతారని ఆమె అన్నారు.