సోమవారం, 2 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 4 మే 2022 (15:20 IST)

ప్రభుత్వాసుపత్రి మాత్రల్లో పురుగులు.. ఎక్కడంటే?

tablets
ప్రభుత్వాసుపత్రిలో ఇచ్చిన మాత్రల్లో పురుగులు కనిపించిన ఘటన వైఎస్సార్‌ జిల్లా బ్రహ్మంగారిమఠం మండల కేంద్రంలో వెలుగుచూసింది.
 
వివరాల్లోకి వెళితే.. అంబేద్కర్‌ కాలనీకి చెందిన ఎస్‌. మోహన్‌ జలుబు చేసిందని సోమవారం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లారు. వైద్యుడు పరిశీలించి 6 మాత్రలు ఇచ్చారు. 
 
మోహన్‌ ఇంటికొచ్చాక తీసి వేసుకుందామని చూడగా.. మాత్రలోంచి చెద పురుగులాంటిది బయటికి వచ్చింది. భయపడి మరొకటి చూడగా.. అందులోనూ పురుగులు కనిపించాయి.
 
మంగళవారం మిగిలిన 4 మందుబిళ్లలను వైద్యుడి వద్దకు తీసుకెళ్లి చూపించారు. దీనిపై వైద్యుడు వెంకటనాగేంద్ర స్పందిస్తూ.. 'మాత్రల్లో పురుగులు వచ్చిన మాట వాస్తవమే.. అవి కాలం తీరినవికావు. తయారీ లోపం వల్ల ఇలా జరిగింది. ఇకపై అలా జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటాం' అని తెలిపారు.