మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 4 మే 2022 (13:25 IST)

శ్రీకాకుళం జిల్లా పర్యటనకు టీడీపీ అధినేత చంద్రబాబు

టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురువారం నుంచి శ్రీకాకుళం జిల్లాలో పర్యటించనున్నారు. "జనం బాట" పేరుతో జరిగే ఈ పర్యటనలో ఏపీలోని వైకాపా ప్రభుత్వ పాలన తీరును ఆయన ఎండగట్టనున్నారు. చంద్రబాబు తన పర్యటనలో భాగంగా, గురువారం శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస నియోజకవర్గం దల్లావలస గ్రామంలో పర్యటిస్తారు. 
 
ఈ నెల 5వ తేదీన భీమిలి నియోజకవర్గంలోని తాళ్లవలస, 6వ తేదీన ముమ్మడివరం నియోజకవర్గంలోని కోరింగ గ్రామంలో జరిగే "బాదుడే బాదుడు" కార్యక్రమంలో ఆయన పాల్గొని వైకాపా ప్రభుత్వ విధానాలను ప్రజలకు వివరించనున్నారు. బాబు పర్యటన కోసం టీడీపీ శ్రేణులు అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. 
 
వైకాపా ప్రభుత్వ హయాంలో విపరీతంగా పెరిగిపోయిన నిత్యావసర వస్తు ధరలు, విద్యుత్, ఆర్టీసీ చార్జీల పెంపు తదితర అంశాలపై ప్రభుత్వ వైఖరిని ఆయన ప్రజలకు వివరించనున్నారు. సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు జరిగే గ్రామ సభలో ఆయన పాల్గొంటారు. ఆ తర్వాత గ్రామంలోని బడుగు, బలహీన వర్గాల ప్రజలతో కలిసి సహపంక్తి భోజనం చేయనున్నారు.