గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శనివారం, 9 జనవరి 2021 (20:24 IST)

వైసీపీ నేతలవి పిచ్చిప్రేలాపనలు: కాలవ శ్రీనివాసులు

వైసీపీ ప్రభుత్వం ఇప్పటివరకు చేసిన తప్పిదాలనుకప్పిపుచ్చుకు నేందుకు మరిన్ని అబద్ధాలుచెబుతూ, ఇంకా ఎక్కువ తప్పులు చేస్తోందని, టీడీపీ పొలిట్ బ్యూరోసభ్యులు, మాజీమంత్రి కాలవ శ్రీనివాసులు స్పష్టంచేశారు. శనివారం ఆయన తననివాసం నుంచి జూమ్ యాప్ ద్వారా విలేకరులతో మాట్లాడారు.

రాష్ట్రంలో  హైందవసంస్కృతిని ప్రభావితం చేసే చర్యలు రాష్ట్రంలో పరాకాష్టకు చేరడం, రామతీర్థంలో రాముని శిరస్సు ఖండింపబడటం అనేది దుర్మార్గమైన చర్యగా కాలవ అభివర్ణించారు. ఏమతాన్ని ఆచరించే వారుకూడా రామతీర్థం ఘటనను సమర్థించరన్నారు.

చంద్రబాబు నాయుడు రామతీర్థానికివెళితే, ఆయన్నిఅడ్డుకోవడానికి ప్రభుత్వం చేసిన కుట్రలను భక్తులుస్వయంగా చేధించారన్నారు.  చంద్రబాబుకు పోటీగా విజయసాయి, సినిమాల్లో విలన్ లా, హైందవ ధర్మాన్ని నాశనం చేయడానికి కంకణం కట్టుకున్న ముఠా సభ్యుడైన వ్యక్తి అక్కడకు వస్తే, అదే భక్తులు ఆయనకు ఎలా బుద్ధి చెప్పారో కూడా అందరికీ తెలిసిందేనన్నారు. 

చంద్రబాబు రామతీర్థం పర్యటనతో వైసీపీప్రభుత్వంలో కలవరం మొదలై, హిందూసమాజం తమప్రభుత్వాన్ని భూస్థాపితం చేయడా నికి సిద్ధంగా ఉందని తెలియడంతో కొందరు ప్రభుత్వ పెద్దలు నష్ట నివారణ చర్యలకు ఉపక్రమించడం జరిగిందన్నారు.

చంద్రబాబు నాయుడు రామతీర్థం వెళ్లకపోయి ఉంటే, విజయసాయిని అక్కడి భక్తులు నిలువరించకపోయిఉంటే, జగన్మోహన్ రెడ్డి హడావుడిగా  కొత్తఆలయాల నిర్మాణానికి ఆలోచన చేసేవాడు కాదన్నారు. ప్రజోపయోగ కార్యక్రమాలు చేస్తున్నసందర్భంలో , ఒకచోట తొలగించిన ఆలయాలను మరోచోటికి మారుస్తున్నప్పుడు కొత్త ఆలయాలు కడుతున్నామని ఎలాచెప్పుకుంటారో పాలకులు సమాధానం చెప్పాలని కాలవ డిమాండ్ చేశారు.

ఆలయాల నిర్మా ణానికి ఎక్కడ స్థలం ఎంపికచేశారో చెప్పకుండా, భూమిపూజ శంఖుస్థాపనల పేరుతో హిందువులను మభ్యపెట్టే కార్యక్రమాన్ని కొనసాగించారని టీడీపీనేత తెలిపారు. ఎవరినిమోసగించడానికి ప్రభుత్వం ఆలయాల నిర్మాణమనే రాగం ఆలపిస్తోందన్నారు.

ముఖ్యమంత్రి కనకదుర్గమ్మ గుడిలో అడుగుపెట్టే సమయంలోనే ఆయన నియోజకవర్గంలో వినాయకుడి విగ్రహం మాయమైందన్నా రు. అందుకు కారకులెవరో ముఖ్యమంత్రి ఎందుకు విచారించలేద  న్న శ్రీనివాసులు, వినాయకుని విగ్రహం మాయమవడం ఎవరికుట్ర అనే ఆలోచన ఆయన ఎందుకు చేయలేదన్నారు? 

హిందూదేవుళ్ల ఉనికిని ప్రశ్నార్థకం చేస్తే, ఎవరికి లబ్ది కలుగుతుందో , దానివల్ల ఎవరికి మేలుకలుగుతుందో గ్రహించలేని స్థితిలో హిందూ సమాజంఉందని పాలకులు భావిస్తున్నారా అని టీడీపీ నేత ప్రశ్నించారు. పాలకుల కల్లబొల్లి మాటలు, ఉత్తుత్తి ఆలయ నిర్మాణాలను ప్రజలు గమనిస్తున్నారన్నారు. వైసీపీ నేతలు, కార్యకర్తల పిచ్చిపిచ్చిప్రేలాపనలు, మంత్రుల అసంబద్ధ వ్యాఖ్యలు, వెల్లంపల్లి  శ్రీనివాస్ వంటి కుక్కమూతి పిందెలు చేస్తున్న అనుచిత వ్యాఖ్యలు ప్రభుత్వపరువుని ఎప్పుడో బజారున పడేశాయన్నారు. 

దుర్గమ్మ గుడికి వెళ్లే అర్హత ముఖ్యమంత్రికి, వెల్లంపల్లికి లేదన్న మాజీమంత్రి, హిందూమతంపై జరుగుతున్న దాడులను విగ్రహాలధ్వంసాన్ని అరికట్టడంలో ఘోరంగా విఫలమైన వారు ఏ అర్హతతో ఆలయాల్లోకి వెళతారన్నారు. జరుగుతున్న ఘటనలకు సంబంధించి ఒక్కరినీకూడా అరెస్ట్ చేయని ప్రభుత్వం, హిందువుల మనసులు గాయపడేలా మరింత దారుణమైన వ్యాఖ్యలు చేస్తోంద న్నారు.  హిందూధర్మాన్ని గురించి మాట్లాడటంగానీ, ఆలయాల ప్రవేశం చేసే అర్హత గానీ వైసీపీవారికి లేనేలేవన్నారు. 

హైందవుల మనోభావాలు తీవ్రంగా దెబ్బతిన్న తరుణంలో స్వామీజీ లు, జాతీయమీడియా జరుగుతున్న ఘటనలపై గగ్గోలు పెట్టడం జరిగిందన్నారు. ఎన్నడూ లేనివిధంగా రాష్ట్రంలోఇప్పుడే హిందూ దేవాలయాలపై దాడులు ఎందుకు జరుగుతున్నాయనే ప్రశ్నకు సమాధానం చెప్పుకోలేని ప్రభుత్వం, నిజాలను  ఎంతోకాలం మరుగున పరచలేదనే వాస్తవాన్ని గ్రహిస్తేమంచిదని శ్రీనివాసులు హితవుపలికారు. హైందవమతంపై చేస్తున్న దాడులనుంచి పాల కులు అంతతేలిగ్గా తప్పించుకోలేరన్నారు. 

వైసీపీనేతలకు సిగ్గు, ఎగ్గూ ఉంటే, రాముడి తలను తీసేసిన వాడు అభినవ రాముడుఎలా అవుతాడో చెప్పాలన్నారు. ప్రపంచానికే ఆదర్శంగా నిలిచిన మర్యాద పురుషోత్తముడికి ప్రతిరూపంగా జగన్మోహన్ రెడ్డిని వర్ణించడమనేది అత్యంత సిగ్గుమాలిన చర్య అని కాలవ మండిపడ్డారు. వైసీపీవారి పిచ్చి పరాకాష్టకుచేరింది అని చెప్పడానికి గోరంట్ల సమీపంలో వేసిన ప్లెక్సీలే నిదర్శనమన్నారు. 

ఆలయాల ధ్వంసానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ముఠా నాయకుడైన వ్యక్తి, అభినవ రాముడు, లక్ష్మణుడు అని ఎవరు భావిస్తున్నారో, వారి పిచ్చి ఏస్థాయిలో ఉందో ప్రత్యేకంగాచెప్పాల్సిన పనిలేదన్నారు వైసీపీవారి రాజకీయ కుట్రలు, కుతంత్రాలు ఏస్థాయిలో ఉన్నాయో చెప్పడానికి కూడా  ఆ ప్లెక్సీనే ఉదాహరణగా నిలుస్తుందన్నారు. 

హైందవ సంస్కృతిపై దాడిచేస్తున్నవారికి, మంచిని సమాధిచేస్తూ, హిందూ ధర్మానికి గోతులుతీస్తున్నవారికే  చంద్రబాబునాయుడు  రాక్షసుడిగా, దుర్మార్గుడిగా, కనిపిస్తాడని  శ్రీనివాసులు స్పష్టం చేశారు.  ముఖ్యమంత్రి చర్యలు, దుర్మార్గాలు, హిందూ సమాజాన్ని తీవ్రంగా బాధిస్తున్నాయని, ఇప్పటికైనా ఆయన లౌకికవాదాన్ని రక్షించే దిశగా ప్రభుత్వ యంత్రాంగాన్ని అప్రమత్తంచేయాలని కాల వ పిలుపునిచ్చారు.

రాష్ట్రంలో ఇంతటి దారుణాలుజరుగుతుంటే, దాడులను  నియంత్రించకపోగా, వాటికి రాజకీయరంగు పులుము తూ, ప్రతిపక్షాన్ని ఆడిపోసుకోవడానికి, చంద్రబాబుని దూషించడా నికి ప్రభుత్వ యంత్రాంగం పనిచేయడమేంటని మాజీమంత్రి నిల దీశారు. రాజ్యాంగధర్మాలను నిర్వర్తించలేని ప్రభుత్వంలో పని చేస్తున్న ఆల్ ఇండియా సర్వీసెస్ అధికారులంతా ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలని టీడీపీ సీనియర్ నేత హితవుపలికారు.

ప్రజలంతా శాంతియుతంగా, సౌభ్రాతృత్వంతో పనిచేసేలా అధికార యంత్రాంగం పనిచేస్తే మంచిదన్నారు. అలాకాకుండా ప్రభుత్వ పెద్దల కోసం సంఘాలపేరుతో, సంఘాల ప్రతినిధులతో పేరుతో  పనిచేయాలని చూడటం తగదన్నారు. ప్రజల సమస్యలను, బాధలను, వారి మనోభావాలను పట్టించుకోకుండా, కొందరువ్యక్తుల మెప్పుకోసం పనిచేస్తే అది సమాజవిచ్చిన్నానికే దారి తీస్తుందన్నారు.

ఆలయాలపై దాడులు ఇలానే కొనసాగితే, సమాజంలోమంచిని కోరుకునే సంఘాలు, వ్యక్తులు, పార్టీలతో కలిసి, ధర్మపరిరక్షణ కోసం చంద్రబాబునాయుడు ఉద్యమిస్తారని కాలవ ప్రభుత్వాన్ని హెచ్చరించారు.