ప్రియురాలితో సంబంధం పెట్టుకున్నాడని పగ, రాత్రివేళ నిద్రిస్తున్న సమయంలో...
వివాహేతర సంబంధాలు కుటుంబాలను పూర్తిగా చిన్నాభిన్నం చేస్తున్నాయి. పగ, ప్రతీకారాలతో హత్యలు చేసుకునే వరుకు వెళుతున్నాయి. వివాహేతర సంబంధాలు వద్దంటూ మహిళా సంఘాలు చెబుతున్నా కొంతమందిలో మార్పు మాత్రం కనిపించడం లేదు. వివాహేతర సంబంధం ఒక వ్యక్తి ప్రాణాల మీదకు తెచ్చింది.
గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం చీలిపాలెం ప్రాంతానికి చెందిన షేక్ సుబానీ అదే ప్రాంతానికి చెందిన మున్నీసా అనే మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఆమెకి ఇంకా వివాహం కాలేదు. అయితే అతనితో కలిసి ఉండడమే కాకుండా గోపి అనే మరో యువకుడికి ఆమె దగ్గరైంది.
ఆ యువతి అడిగినవన్నీ కొనిస్తూ ఆమెకు బాగా దగ్గరయ్యాడు గోపి. దీంతో షేక్ సుబానీని పక్కన పెట్టేసింది మున్నీసా. దీంతో ఆగ్రహంతో ఊగిపోయాడు సుబానీ. గోపినే ఇందుకు కారణమని భావించాడు. అతన్ని చంపేయాలనుకున్నాడు. ఇంటి బయట నిద్రిస్తున్న గోపిపై కత్తితో దాడి చేశాడు షేక్ సుబానీ. తీవ్రగాయాల పాలైన గోపి ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. బాధితుడి పరిస్థితి విషమంగా ఉంది.