ఆదివారం, 5 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 10 అక్టోబరు 2024 (23:28 IST)

అబద్దపు హామీలు ఇచ్చి ఉంటే సీఎం సీట్లో నేనే ఉండేవాడినేమో : జగన్

jagan
jagan
అబద్దపు హామీలు ఇచ్చి ఉంటే సీఎం సీట్లో తానే ఉండేవాడినేమోనని ఏపీ మాజీ సీఎం, వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి అన్నారు. 2019లో అడ్డగోలు అబద్దపు హామీలు ఇచ్చినందునే 151 సీట్లు ఇచ్చారని మండిపడ్డారు. కష్టాలెప్పుడూ శాశ్వతంగా ఉండవని, చీకటి తర్వాత వెలుగు తప్పకుండా వస్తుందని, ఇది సృష్టి సహజమని జగన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మంచివైపు దేవుడు తప్పకుండా ఉంటాడన్నారు.
 
రేపల్లె నియోజకవర్గంలో అనుకోని పరిస్థితులు ఉత్పన్నమయ్యాయని, విలువలు, విశ్వసనీయతే తమకు శ్రీరామ రక్ష అని జగన్ తెలిపారు. రేపల్లెకు చెందిన పార్టీ నేత మోపిదేవి టీడీపీలో చేరిన సందర్భంగా జగన్ మాట్లాడుతూ.. మోపిదేవి వెంకట రమణ పార్టీని వీడి వెళ్లిపోవడం బాధాకరమన్నారు. మోపిదేవి వెంకటరమణకి మంచే చేశామన్నారు. తాను ఎమ్మెల్యేగా ఓడిపోయినా మంత్రిపదవి ఇచ్చామని గుర్తుచేసుకున్నారు.