యష్ రాజ్ ఫిల్మ్స్ నిర్మాణంలో సయారా విడుదలతేదీ ప్రకటన
అహాన్ పాండే, అనీత్ పద్దా జంటగా యష్ రాజ్ ఫిల్మ్స్ నిర్మాణంలో మోహిత్ సూరి తెరకెక్కిస్తున్న చిత్రం సయారా. తాజాగా ఈ మూవీకి సంబంధించిన అప్డేట్‌ను ఇచ్చారు. ఈ సినిమాను జూలై 18, 2025న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయబోతోన్నారు. ఆదిత్య చోప్రా సమర్పణలో అక్షయ్ విద్హానీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
సయారా చిత్రాన్ని ఓ ఇంటెన్స్ ఎమోషనల్ లవ్ స్టోరీగా తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీతో హిందీ చిత్ర పరిశ్రమలో అహాన్ పాండే అడుగు పెడుతున్నారు. అనీత్ పద్దా కథానాయికగా నటించిన సయారా చిత్రం యూత్ ఫుల్ రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్‌గా జూలై 18, 2025న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.