ఆదివారం, 12 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By selvi
Last Updated : సోమవారం, 19 ఫిబ్రవరి 2018 (10:20 IST)

పవన్ కళ్యాణ్ సినిమా ట్రిక్కులు ప్రజలు నమ్మబోరు : ఆర్కే.రోజా

సినీ హీరో పవన్ కళ్యాణ్ చేస్తున్న ట్రిక్కులను ప్రజలను ఎన్నటికీ నమ్మబోరనీ సినీ నటి, వైకాపా ఎమ్మెల్యే ఆర్.కె. రోజా జోస్యం చెప్పారు. ఆమె సోమవారం తిరుమలకు వచ్చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, గతంలో ఆంధ్రప్

సినీ హీరో పవన్ కళ్యాణ్ చేస్తున్న ట్రిక్కులను ప్రజలను ఎన్నటికీ నమ్మబోరనీ సినీ నటి, వైకాపా ఎమ్మెల్యే ఆర్.కె. రోజా జోస్యం చెప్పారు. ఆమె సోమవారం తిరుమలకు వచ్చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, గతంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించేందుకు ధర్నాలు, నిరసనలకు దిగుతానని హెచ్చరించిన పవన్, ఇప్పుడు ఎందుకోసం వెనక్కు తగ్గారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా నేత రోజా ప్రశ్నించారు. 
 
అంతేకాకుండా, ప్రశ్నిస్తానంటూ గొప్పలు చెప్పుకున్న పవన్, నాలుగేళ్ల పాటు మౌనంగా ఉండి, ఇప్పుడు జేఎఫ్సీ అంటూ ప్రజల ముందుకు వస్తే నమ్మబోరని అన్నారు. రాజకీయ పక్షాలు పార్టీలకు అతీతంగా ఏకతాటిపైకి వచ్చి పోరాడితేనే ప్రత్యేక హోదా సాధ్యమవుతుందని ఆమె అభిప్రాయపడ్డారు. అదేసమయంలో పవన్ సూచించిన విధంగా కేంద్రంపై అవిశ్వాస తీర్మానానికి జగన్ సిద్ధమన్నారు. అయితే, ఇందుకు అవసరమైన ఎంపీల మద్దతు కోసం పవన్ సహకరించాలని రోజా డిమాండ్ చేశారు.