ఆదివారం, 26 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 22 డిశెంబరు 2020 (14:45 IST)

దేవుడున్నాడురా బుజ్జీ... అవినీతిపాలన అందించే ఏకైక నేత మా జగన్!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైఎస్. జగన్మోహన్ రెడ్డి బాధ్యతలు స్వీకరించిన తర్వాత రాష్ట్రంలో అవినీతి గేట్లు ఎత్తేశారంటూ విపక్షాలు గగ్గోలు పెడుతున్నాయి. ఇదే అంశంపై విపక్ష నేతలు ప్రెస్మీట్లు పెట్టి మరీ విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ క్రమంలో జగన్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి అవినీతి పాలన అందిస్తున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. పైగా, భారతదేశ చరిత్రలో అవినీతి పాలన అదించే ఏకైక నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది వైఎస్. జగన్మోహన్ రెడ్డిగారే అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. 
 
ఇంతకీ ఆ ఎమ్మెల్యే ఎవరా అన్నదే కదా మీ సందేహం. విజయనగరం జిల్లా, శృంగవరపుకోట ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు ఈ వ్యాఖ్యలు చేశారు. విచిత్రం ఏంటంటే.. ఆయన అవినీతి నాయకుడంటూ ముఖ్యమంత్రిని కీర్తించినా.. పక్కన ఉన్న వైసీపీ నేతలు సైతం చప్పట్లు గట్టిగా కొట్టారు. 
 
నిజానికి ఎమ్మెల్యే శ్రీనివాస రావు తడబడ్డారో.. పొరబడ్డారో.. లేక మనసులో మాట చెప్పారో తెలియదుగానీ... అవినీతి పరిపాలన అందించగల ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి అంటూ కీర్తించారు. ఆయన ఈ వ్యాఖ్యలు సీఎం జగన్ పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో చేశారు.