శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : గురువారం, 5 డిశెంబరు 2019 (15:37 IST)

రాజకీయ అజ్ఞాని పవన్ కళ్యాణ్... చంద్రబాబు బినామీ : సి. రామచంద్రయ్య

కొన్ని రోజులుగా కనుమరుగు అయిన జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అజ్ఞానంతో మళ్ళీ బయటకు వచ్చారని వైకాపా అధికార ప్రతినిధి. సి.రామచంద్రయ్య అన్నారు. ఆయన ఇప్పటికి చంద్రబాబు బినామీ అని ఆరోపించారు. 
 
ఆయన బుధవారం మీడియాతో మాట్లాడుతూ, గత ఎన్నికల్లో వామపక్ష పార్టీలతో కలసి టీడీపీకి అనుకూలంగా ప్రచారం చేశావ్. ప్రశ్నిస్తా అని పార్టీ పెట్టి ఎం చేశావ్. గత టీడీపీ హయాంలో వేల కోట్ల రూపాయల అవినీతి జరిగితే నిద్రపోయావా. పవన్ కళ్యాణ్ బీజేపీ చంక ఎక్కాలని చూస్తున్నారు. 
 
రాష్ట్ర ఎన్నికల తీర్పులో నీ స్థానం ఎంటి అనేది తెలుసుకుని మాట్లాడాలి. ప్రజల్లో అభిమానం లేకనే ఓట్లు పడలేదు. పోటీ చేసిన రెండు స్థానాల్లో ఘోర పరాజయం చెందిన ఏకైక నాయకుడు. ఏమైనా ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని పడగొట్టాలని చూస్తే మహారాష్ట్రలో పట్టిన గతే పడుతుంది. 
 
కులాల మధ్య చిచ్చు పెట్టాలని పవన్ కళ్యాణ్ చూస్తున్నారు. చంద్రబాబు సూచనలతో పవన్ నడుస్తున్నారు. ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తిని అమర్యాదగా మాట్లాడుతారు. జగన్ రెడ్డి అంటూ అవహేళనగా మాట్లాడుతారు. కులాలను అడ్డం పెట్టుకుని ఎన్నికలకు వెళ్ళింది ఎవరు. 
 
కేవలం రాష్ట్ర ప్రభుత్వంపైనే విమర్శలు చేయడానికే పవన్ కళ్యాణ్ చూస్తున్నారు. ప్రతిపక్షంలో ఉన్నా అధికారంలో ఉన్నా కేవలం వైసీపీపైనే ఆరోపణలు చేయడం హేయమైంది. గతంలో ట్వీట్లు అన్ని ఆంగ్లంలోనే పెట్టే పవన్ కళ్యాణ్ అప్పుడు తెలుగు అంతరించి పోయిందా. 

బాషా పండితులతో పవన్ కళ్యాణ్ రౌండ్ టేబుల్ సమావేశం ప్రభుత్వానికి మేలు. రోజుకొక ముసుగు ధరించి పవన్ కళ్యాణ్ విమర్శలు చేస్తున్నారు. రేపిస్టులకు రెండు చెంప దెబ్బలు చాలు అనడం సిగ్గుచేటు.

ఆరోపణలు, విమర్శలు చేసేటప్పుడు ఆలోచించి చేస్తే బాగుంటుంది. పవన్ కళ్యాణ్ చేసే ఆరోపణలు చుస్తే అవగాహన లోపంతో చేస్తున్నారు అనేది బయట పడుతుందని రామచంద్రయ్య ఆరోపించారు.