మంగళవారం, 8 జులై 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : సోమవారం, 19 నవంబరు 2018 (10:13 IST)

పవన్ పార్టనర్ చంద్రబాబు రాజకీయ వ్యభిచారి.. సుధాకర్ బాబు

పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌పై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత సుధాకర్ బాబు సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. పవన్ కల్యాణ్ ఓ చీడపురుగు అంటూ ఫైర్ అయ్యారు. జనసేనను సీఎం చంద్రబాబుకు ఎంతకు అమ్మారో పవన్ చెప్పాలని అడిగారు. చంద్రబాబుకు అమ్ముడుపోయిన క్యారెక్టర్ లెస్ ఫెలో పవన్ అని జనం చెప్పుకుంటున్నారని తెలిపారు. 
 
అసెంబ్లీకి ఎదురు వెళ్లరని ప్రశ్నిస్తున్న పవన్ వైసీపీ ఎమ్మెల్యేలను సంతలో పశువుల్లా కొంటుంటే.. చంద్రబాబును ఎందుకు అడ్డుకోలేదన్నారు. చంద్రబాబు అనే దోపిడిదారునికి కొమ్ముకాసిన చరిత్ర హీనుడు పవన్ అని సుధాకర్ తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. పవన్ పార్టనర్ చంద్రబాబు రాజకీయ వ్యభిచారి అని నిప్పులు చెరిగారు. 
 
సినీ వ్యామోహంతో మీ వెంట వెంపర్లాడే యువకులను, కులదారుల్లోకీ తీసుకెళ్తావా పవన్ అంటూ మండిపడ్డారు. నీతి, నియమం, కుటుంబం, వివాహం, రాజకీయం, సమాజం అనే వ్యవస్థలకు పట్టిన చీడపురుగు పవన్ అని వ్యాఖ్యానించారు.