గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. ఎన్నికలు 2019
  3. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2019
Written By
Last Modified: బుధవారం, 10 ఏప్రియల్ 2019 (18:04 IST)

నేను ఓటు వేసేందుకు వైజాగ్ వచ్చా... నా ఓటు ఏదీ?: రష్మీ గౌతమ్ ప్రశ్న

ఓట్లు గల్లంతయ్యాయంటూ ఆమధ్య వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై రాజకీయ పార్టీలు ఆరోపణలు చేసుకున్నాయి. కాగా ఏప్రిల్ 11న... అంటే రేపు తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి.

ఓటు వేసేందుకు సామాన్యులతో పాటు సెలబ్రిటీలు సైతం తమతమ ఊళ్లకు వెళ్లారు. వీరిలో జబర్దస్త్ యాంకర్ రష్మి గౌతమ్ కూడా వున్నారు. ఐతే ఆమె ఓటు వేసేందుకు ఎవ్వరూ ఎలాంటి స్లిప్ ఇవ్వలేదట.
 
రష్మి ట్విట్టర్లో పేర్కొంటూ... ఓటు వేసేందుకు నేను నా తల్లితో సహా వైజాగ్ వెళ్లాను. నాకు ఓటర్ ఐడీ అక్కడే వుండటంతో ఓటు వేసేందుకు వెళ్లాను. గమనించాల్సిన విషయం ఏంటంటే... నాతోపాటు మా ఏరియాలో వారికి ఓటరు స్లిప్పులను ఎవ్వరూ ఇవ్వలేదు. పోనీ వివరాలు కనుక్కుందామని ఎన్నికల సంఘం సైట్ చూస్తే అక్కడ కూడా నాకు నిరాశే ఎదురయ్యింది. మరి నేను ఓటు వేయడం ఎట్లా. ఇలాంటి పరిస్థితి ఎంతమంది ఎదుర్కొంటున్నారో అంటూ వాపోయింది.