మంగళవారం, 16 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. ఎన్నికలు 2019
  3. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2019
Written By
Last Updated : సోమవారం, 18 మార్చి 2019 (16:31 IST)

కమ్మోడు సైతం చంద్రబాబుకు ఓటు వేయొద్దు : పోసాని కృష్ణమురళి పిలుపు

ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై సినీ నటుడు పోసాని కృష్ణమురళి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒక కులానికి చెందినవారే కాదు... కమ్మోడు సైతం చంద్రబాబుకు ఓటు వేయవద్దని ఆయన పిలుపునిచ్చారు. ఆయన సోమవారం విలేకరులతో మాట్లాడుతూ, 'ఈ సందర్భంగా మీడియా ద్వారా ప్రజలకు చెప్పదలచుకున్నాను. ఎవడు దొంగో..'దొంగ' అనే చెప్పండి. ఎవడు లుచ్ఛానో 'లుచ్ఛా' అనే చెప్పండి. ఎవడు మంచోడో..'మంచోడు' అనే చెప్పండి అంటూ ప్రజలకు విజ్ఞప్తి చేశాడు. 
 
ముఖ్యంగా, ప్రజలకు నేనేమి చెప్పదలచుకున్నానంటే.. ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న అన్ని కులాలకు, మతాలకు ఒక్క మాట చెబుతున్నాను. ఏ కులం వాడు కూడా ఇన్‌క్లూడింగ్ 'కమ్మ'.. చంద్రబాబు అనే వాడికి ఓటు వేయొద్దు. అతనొక పెద్ద దొంగ.. అబద్ధాల మనిషి.. అవినీతిపరుడు. ఇంత కూడా విలువలు లేకుండా బతుకుతున్న మనిషి. చంద్రబాబుకు ఎవరైనా ఓటు వేస్తే, అది కమ్మ రాజ్యానికి, కమ్మ కులానికి, కమ్మ దేశానికి మాత్రమే ఓటేసినట్టే. మరొక్కసారి చంద్రబాబుకు మీరు ఓటేసి గెలిపించారంటే, ఆంధ్ర రాష్ట్రం కమ్మ రాష్ట్రం అయిపోతుంది. ఆంధ్ర దేశం నాశనమైపోతుంది' అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. 
 
గత 2009 ఎన్నికల్లో పోసాని కృష్ణమురళి ప్రజారాజ్యం పార్టీ తరపున చిలకలూరిపేటలో పోటీ చేశారు. ఆ సమయంలో కమ్మ కులాన్ని సైతం చంద్రబాబు తిట్టాడని గుర్తుచేశాడు. ముఖ్యంగా, చిరంజీవి కుటుంబంలోని ఆడవాళ్లను కూడా చంద్రబాబు తన పార్టీ వాళ్లతో తిట్టించారని ఆరోపించారు. గత ఎన్నికల్లో పవన్ కల్యాణ్ వల్లే గెలిచిన చంద్రబాబు, ఈరోజున ఆయన్ని కూడా తిడుతున్నారని విమర్శించారు. 
 
'ఇది మంచి.. ఇది చెడు' అని చెబుతున్న పవన్ కల్యాణ్‌ని అమ్మలక్కలతో తిట్టిస్తావా? పలుమార్లు ప్రెస్‌మీట్‌లో పనవ్ కల్యాణ్ బాధపడుతూ చెప్పాడు' అని చంద్రబాబుపై పోసాని నిప్పులు చెరిగారు. మొన్నటి దాకా మోడీ కాళ్లు పట్టుకుని, ఆయనకు శాలువా కప్పిన చంద్రబాబు, ఇప్పుడు, అదే మోడీని హీనంగా తిడుతున్నారని ఎద్దేవా చేశారు. నాడు సోనియా, రాహుల్ గాంధీలను తిట్టిన చంద్రబాబు, ఇప్పుడు వాళ్లను వాటేసుకుంటున్నారంటూ పోసాని కృష్ణమురళి ఘాటుగా వ్యాఖ్యానించారు.