బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజయవాడ , మంగళవారం, 26 అక్టోబరు 2021 (11:04 IST)

తెలుగు రాష్ట్రాల్లో నవంబర్‌లో బ్యాంకులకు 17 రోజుల సెలవులు!

ఈ మ‌ధ్య కాలంలో బ్యాంకుల‌కు సెల‌వులు ఎక్క‌వ‌యిపోయాయ‌ని ఖాతాదారులు గ‌గ్గోలు పెడుతున్నారు. అత్యంత అవ‌స‌ర‌మైన ఆర్ధిక లావాదేవీల‌ను పూర్తి చేయ‌డానికి బ్యాంకులు తెరిచి ఉంచ‌డం ఎంతో ముఖ్యం. కానీ, వ‌రుస సెల‌వుల‌తో అంద‌రూ ఇబ్బందులు ప‌డిపోతున్నారు. దీనికి ప్ర‌త్యామ్న‌య వ్య‌వ‌స్థ ఏర్పాట్లు కావాల‌ని డిమాండు చేస్తున్నారు.
 
నవంబర్‌లో బ్యాంకులకు వరుస సెలవులు రానున్నాయి. ఆర్‌బీఐ ప్రకటించిన జాబితా ప్రకారం ముఖ్యమైన పండుగలు, సాధారణ సెలవులు కలుపుకొని మొత్తం 17 రోజులు బ్యాంకులు పనిచేయవు. అయ్యో! వచ్చే నెలలో చాలా బ్యాంకు పనులు పెట్టుకున్నానే.. అని కంగారు పడొద్దు. అవన్నీ అన్ని రాష్ట్రాలకూ వర్తించవు. రాష్ట్రాలను బట్టీ మారుతూ ఉంటాయి. తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే దీపావళి, గురునానక్‌ జయంతి/ కార్తిక పూర్ణిమ సందర్భంగా రెండు రోజులు బ్యాంకులకు సెలవులు రానున్నాయి. సాధారణ సెలవులు (శని, ఆదివారాలు)తో కలుపుకొని మొత్తం 8 రోజుల పాటు బ్యాంకులు పనిచేయవు. ఆయా తేదీలను బట్టి మీ బ్యాంక్‌ పనులను షెడ్యూల్‌ చేసుకోవాల‌ని ఆర్దిక నిపుణులు పేర్కొంటున్నారు.
 
తెలుగు రాష్ట్రాల్లో బ్యాంకులకు సెలవులివే..
* నవంబర్‌ 4 - దీపావళి (గురువారం)
* నవంబర్‌ 7 - (ఆదివారం)
* నవంబర్‌ 13 - (రెండో శనివారం)
* నవంబర్‌ 14 - (ఆదివారం)
* నవంబర్‌ 19 - గురునానక్‌ జయంతి/కార్తిక పూర్ణిమ (శుక్రవారం)
* నవంబర్‌ 21 - (ఆదివారం)
* నవంబర్‌ 27 - (నాలుగో శనివారం)
* నవంబర్‌ 28 - (ఆదివారం)