శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 23 సెప్టెంబరు 2020 (14:54 IST)

అమ్మాయిని కాళ్లుచేతులు కట్టేసి.. కిరోసిన్ పోసి నిప్పంటించారు...

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని సుల్తాన్ పూర్ జిల్లాలో దారుణం జరిగింది. పాతకక్షలు బుసలు కొట్టాయి. ఫలితంగా అభంశుభం తెలియని 16 యేళ్ల అమ్మాయిని కాళ్లు చేతులు కట్టేసి వంటిపై కిరోసిన్ పోసి నిప్పంటించి సజీవదహనం చేశారు. జిల్లాలోని తాదార్శ గ్రామంలో జరిగిన ఈ దారుణ ఘటన వివరాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. 
 
ఈ గ్రామంలో రెండు కుటుంబాల మధ్య జూన్ నెలలో గొడవలు జరిగాయి. దీంతో ఇరు కుటుంబాలు స్థానిక పోలీస్ట్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో బాలిక తండ్రిని గతంలో అరెస్టు చేశారు. ఆ తర్వాత అతను బెయిలుపై విడుదలయ్యారు. 
 
ఈ క్రమంలో పాత కక్షలు మళ్లీ చెలరేగాయి. దీంతో పక్కింట్లో ఉన్న ముగ్గురు వ్యక్తులు 18 ఏళ్ల అమ్మాయిని పట్టుకొని కాళ్లు చేతులు కట్టేసి అనంతరం అమ్మాయిపై కిరోసిన్ పోసి నిప్పంటించారు. స్థానికులు స్పందించి మంటలను ఆర్పేసి బాధితురాలిని లక్నో ప్రభుత్వాస్పత్రికి తరలించారు. 
 
ఆమె చికిత్స పొందుతూ బుధవారం ఉదయం కన్నుమూసింది. బల్డిరాయ్ పోలీస్ అధికారి విజయ్ మాల్ యాదవ్ ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసులో నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.