గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. బిబిసి తెలుగు
Written By బిబిసి
Last Modified: బుధవారం, 23 సెప్టెంబరు 2020 (14:24 IST)

జన్‌ధన్ ఖాతాలో రూ. 10 కోట్లు.. ఎలా వచ్చాయో తెలియదంటున్న పదహారేళ్ల అమ్మాయి- ప్రెస్ రివ్యూ

ఉత్తర్‌ప్రదేశ్‌లో ఒక యువతి ఖాతాలో ఆమెకు తెలీకుండానే 10 కోట్ల రూపాయలు జమ అయినట్లు ఈనాడు ఒక కథనం ప్రచురించింది. ‘‘ఉత్తరప్రదేశ్‌లోని బలియా జిల్లాకు చెందిన సరోజ్‌కు అలహాబాద్ బ్యాంకులో 2018 నుంచి ఖాతా ఉంది. సోమవారం ఆమె బ్యాంకుకు వెళ్లినపుడు ఆమె ఖాతాలో రూ.9.99 కోట్లు ఉన్నాయని అధికారులు చెప్పారు.
 
తన ప్రమేయం లేకుండానే బ్యాంక్ ఖాతాలో దాదాపు రూ.10 కోట్లు జమ కావడంతో విస్తుపోవడం ఆ అమ్మాయి వంతైంది. నిరక్షరాస్యురాలైన ఆమె దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద డబ్బు జమ చేయడానికి అంటూ గతంలో ఒక వ్యక్తి తన ఆధార్ కార్డు, ఫొటో అడిగితే పంపించానని, ఆ నంబరుకు ఇప్పుడు ఫోన్ చేస్తే స్విచాఫ్ వస్తోందని మంగళవారం ఆమె విలేకరులకు తెలిపింది.
 
అంత డబ్బు ఎక్కడ నుంచి వచ్చిందో తనకు తెలీదని సరోజ్ చెప్పార’ని ఈనాడులో రాశారు.