శనివారం, 23 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 22 సెప్టెంబరు 2020 (12:53 IST)

కరోనా కాలంలో మహిళా టీచర్లకు తప్పని వేధింపులు.. వీడియోలు చూపిస్తూ..?

కరోనా కాలంలో ఆన్‌లైన్ క్లాసులంటూ ఉపాధ్యాయులు నానా తంటాలు పడుతున్నారు. ఇలా కష్టపడినా జీతాలు కూడా కొందరు ఉపాధ్యాయులు అందుకోవట్లేదు. ఇవి చాలదన్నట్లు కామాంధులు మాత్రం మహిళా ఉపాధ్యాయులను వేధింపులకు గురిచేస్తున్నారు. జీతాలు ఇవ్వకపోవడమే కాకుండా తమను లైంగిక వేధింపులకు గురిచేస్తున్నట్లు మహిళా ఉపాధ్యాయులు పాఠశాల యాజమాన్యంపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. స్థానికంగా ఉన్న రిషబ్ అకాడమి స్కూల్ సెక్రటరీ రంజిత్ జైన్, ఆయన కుమారుడు అభినవ్ తమను లైంగిక వేధింపులకు గురిచేస్తున్నట్లు మహిళా టీచర్స్ ఆరోపించారు. తమకు ఎంతోకాలంగా జీతాలు చెల్లించడం లేదని, జీతం డిమాండ్ చేసినప్పుడల్లా పాఠశాల యాజమాన్యం మహిళా ఉపాధ్యాయులతో అసభ్యంగా ప్రవర్తిస్తుందని బాధితులు పేర్కొన్నారు. 
 
అంతేకాకుండా మహిళా టాయిలెట్స్‌లో స్పై కెమెరాలు అమర్చినట్లుగా తెలిపారు. ఈ ఫోటోలు, వీడియోలు చూపిస్తూ తమతో శారీరక సంబంధం పెట్టుకోవాల్సిందిగా బ్లాక్‌మెయిల్‌కు పాల్పడుతారన్నారు. యాజమాన్యం చెప్పుచేతుల్లోకి రాని మహిళా టీచర్లను అదుపులోకి తెచ్చుకునేందుకు మంత్రగాళ్లని సైతం ఆశ్రయిస్తారన్నారు. మహిళా ఉపాధ్యాయుల ఫిర్యాదు మేరకు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.