గన్నవరం ఎయిర్‌పోర్టులో భారీగా బంగారం పట్టివేత

gannavaram airport
ఎం| Last Updated: శుక్రవారం, 20 నవంబరు 2020 (11:17 IST)
గన్నవరం ఎయిర్‌పోర్టులో కస్టమ్స్‌ అధికారులు గురువారం రాత్రి భారీగా బంగారం పట్టుకున్నారు. కువైట్ నుంచి వచ్చిన ఇద్దరు ప్రయాణికులను అనుమానంతో తనిఖీలు నిర్వహించగా, వారి నుంచి ఎటువంటి పత్రాలు లేని 1.865 కేజీల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.

పట్టుబడ్డ బంగారం విలువ రూ.95,11,500 ఉంటుందని కస్టమ్స్‌ అదనపు కమిషనర్‌ నాగేంద్రరావు తెలిపారు. ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశామని, బంగారం ఎక్కడికి తరలిస్తున్నారన్న దానిపై దర్యాప్తు చేస్తున్నామని ఆయన వెల్లడించారు.
దీనిపై మరింత చదవండి :