శుక్రవారం, 8 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 1 జూన్ 2023 (15:45 IST)

ఏపీలో 50 శాతం పెరిగిపోయిన సిజేరియన్‌ ప్రసవాలు

Pregnant woman
ఆంధ్ర రాష్ట్రంలోని ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో జరిగే ప్రసవాలలో 50 శాతానికి పైగా సిజేరియన్‌ ద్వారానే జరుగుతున్నట్లు జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే వెల్లడించింది. దీంతో ఆంధ్రప్రదేశ్‌లో ఆందోళన నెలకొంది. ఆపరేషన్ ద్వారా పుట్టిన పిల్లల్లో 50.5 శాతం పట్టణ ప్రాంతాల్లో, 39.3 శాతం గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నాయి. 
 
ప్రసవం చుట్టూ అనేక అపోహలు, అపార్థాలు ఉన్నాయి. మంచి రోజు లేదా మంచి సమయంలో ప్రసవించాలని కొందరు ఆపరేషన్ ద్వారా బిడ్డను కనడానికి ఇష్టపడతున్నారు. కొన్ని ఆసుపత్రులు తల్లికి సాధారణ ప్రసవం చేసే సామర్థ్యం ఉన్నప్పటికీ ఆపరేషన్‌ను ఎంచుకోవాలని సిఫార్సు చేస్తున్నాయి.
 
దీని వల్ల సాధారణ డెలివరీతో పోలిస్తే ఎక్కువ ఛార్జీలు వసూలు చేయవచ్చు. కొన్ని సందర్భాల్లో, ప్రజలు స్వయంగా ఆపరేషన్ డిమాండ్ చేస్తారు. సాధారణ జననం కంటే ఇది సురక్షితమని వారు నమ్ముతున్నారు 
 
ఇటీవలి రోజుల్లో మారుతున్న జీవనశైలి, ఆలస్యంగా గర్భం దాల్చడం, కృత్రిమ గర్భధారణ పెరగడం వంటి కారణాల వల్ల ఆపరేషన్ ద్వారా బిడ్డ పుట్టడం మామూలైపోయిందని వైద్యులు చెప్తున్నారు. ఇది డెలివరీ సమయంలో సమస్యల రేటును పెంచుతుంది. తల్లి- బిడ్డ ఇద్దరి ప్రాణాలను కాపాడటానికి కొన్ని పరిస్థితులలో ఆపరేషన్ ఎంపిక చేయబడుతుందని వారు వెల్లడించారు.