13 ఏళ్ల చిన్నారిపై 8 నెలలుగా 80 మంది సామూహిక అత్యాచారం.. ఎక్కడ?
తెలుగు రాష్ట్రాల్లో మహిళలపై అకృత్యాలు పెచ్చరిల్లిపోతున్నాయి. 13 ఏళ్ల చిన్నారిపై 8 నెలలుగా 80 మంది సామూహిక అత్యాచారానికి పాల్పడిన దుర్ఘటన గుంటూరులో చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. 13 ఏళ్ల యువతి దత్తత తీసుకుంటున్నట్లు నటించి.. ఆ చిన్నారిని తీసుకెళ్లి బలవంతంగా వ్యభిచార కూపంలోకి దింపింది ఓ మహిళ.
ఎట్టకేలకు ఆ చిన్నారిని పోలీసులు ఆ నరక కూపం నుంచి సోమవారం బయటకు తెచ్చారు. గుంటూరులోని బ్రోతల్ హౌస్ నుంచి చిన్నారిని కాపాడి.. మొత్తం 80 మందిని అరెస్ట్ చేశారు.
ఈ ఘటనలో ప్రధాన నిందితురాలు, చిన్నారిని వ్యభిచారంలోకి దింపిన సవర్ణ కుమారినీ అదుపులోకి తీసుకున్నారు. పరారీలో ఉన్న నిందితులపై లుకౌట్ నోటీసులు జారీ చేశారు.
ఈ ఘటనకు సంబంధించి ఓ నిందితుడు ప్రస్తుతం లండన్ లో ఉన్నట్టు చెప్పారు. ఈ ఘటనకు సంబంధం వున్నవారిపై తగిన చర్యలు తీసుకునేందుకు పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.