ఆదివారం, 26 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జె
Last Modified: శనివారం, 11 జులై 2020 (22:43 IST)

సెల్ఫీ వీడియో తీస్తూ ఉరివేసుకున్న యువతి, ముగ్గురు యువకులకు వాట్సాప్ పంపి?

నెల్లూరు జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ముగ్గురు యువకులు మానసికంగా హింసిస్తున్నారంటూ ఒక యువతి సెల్ఫీ వీడియో తీస్తూ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. యువతి ఆత్మహత్య జిల్లా వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారుతోంది. 
 
భక్తవత్సల నగర్‌లో రమ్య అనే విద్యార్థిని ఇంట్లో ఫ్యానుకు ఉరి వేసుకుంది. ఉరి వేసుకునే ముందు సెల్ఫీ వీడియో తీసి తన ముగ్గురి స్నేహితులు.. యువకులకు ఆ వీడియోను వాట్సాప్ ద్వారా పంపింది. మీ వల్లే చనిపోతున్నానంటూ ఆ వీడియోలో స్పష్టంగా చెప్పింది. 
 
రమ్య స్థానికంగా నెల్లూరులోని ఒక ప్రైవేటు కళాశాలలో డిగ్రీ సెకండియర్ చదువుతోంది. తనకు దగ్గరగా ఉన్న స్నేహితులు తనను మోసం చేయడం.. మానసికంగా హింసించడంతో తట్టుకోలేని రమ్య ఆత్మహత్యకు పాల్పడినట్లు బంధువులు చెబుతున్నారు. ఘటనా స్థలంలో సుసైడ్ లెటర్‌ను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురు యువకుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.