మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 10 జులై 2020 (11:35 IST)

సియోల్ మేయర్ ఆత్మహత్య.. ఎందుకో తెలుసా?

దక్షిణ కొరియా అధ్యక్ష పదవికి పోటీపడనున్నట్టు ప్రచారం జరిగిన సియోల్ మేయర్ పార్క వోన్ సూన్ అనూహ్య పరిస్థితుల్లో ఆత్మహత్య చేసుకున్నారు. ఈయన వయసు 64 యేళ్లు. ఈయనపై లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చాయి. దీంతో ఆయన బలవన్మరణానికి పాల్పడ్డాడు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, దక్షిణ కొరియా డెమొక్రటిక్ పార్టీలో సీనియర్ నేతగా ఉన్న పార్క్ వోన్ - సూన్, దాదాపు దశాబ్దకాలం పాటు సియోల్ ప్రజా ప్రతినిధిగా కొనసాగారు. సియోల్ మేయరుగా ఉన్నపార్క్ వోన్-సూన్‌పై ఇటీవలే సియోల్ సిటీ ఉద్యోగి ఒకరు లైంగిక వేధింపుల కేసు పెట్టారు. ఈ కేసు విచారణ దశలో ఉందని తెలిపారు. 
 
ఈ కేసు విషయం తెలియగానే గురువారం మధ్యాహ్నం నుంచి పార్క్ వోన్ -సూన్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారని, వందలాది మంది అధికారులు ఆయన కోసం గాలిస్తుండగా, శుక్రవారం విగత జీవుడిగా కనిపించారని వెల్లడించారు.
 
తన తండ్రి కనిపించడం లేదని పార్క్ కుమార్తె గురువారం పోలీసులను ఆశ్రయించగా, అప్పటి నుంచి ఆయన్ను వెతికారు. ఇంటి నుంచి వెళ్లిన తర్వాత, ఆయన తనకు ఫోన్ చేశారని, అవే ఆయన చివరి మాటలుగా తనకు అనిపించిందని, ఆపై తన ఫోన్‌ను స్విచ్ ఆఫ్ చేసుకున్నారని ఆమె తెలిపారు. 
 
కాగా,