సోమవారం, 21 అక్టోబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 21 అక్టోబరు 2024 (13:39 IST)

శ్రీవారి గర్భగుడి పై నుంచి హెలికాప్టర్.. ఆగమ శాస్త్రానికి విరుద్ధం (video)

Helicopter
Helicopter
సాధారణంగా తిరుమల శ్రీవారి ఆలయం మీద ప్రయాణించకూడదు. చివరకు స్వామి వారి కైంకర్యాలు చూసే ఏ అర్చకుడు కూడా సముద్రాలు దాటి ప్రయాణం చేయరు. దాదాపు శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయం పరిసర ప్రాంతాలు దాదాపు నో ఫ్లై జోన్‌గా వుంది. దీనిపై విమానాలు లేదా హెలికాఫ్టర్లు ఎలాంటి ప్రయాణం చేయడానికి వీలు లేదు. 
 
తాజాగా శ్రీవారి గర్భగుడి పై నుంచి హెలికాప్టర్ ఎగిరింది. తిరుమల కొండలపై నుంచి విమానాలు, హెలికాప్టర్లు తిగడం ఆగమ శాస్త్రానికి విరుద్ధమని పండితులు అంటున్నారు. తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో కేవలం 8 కంపార్ట్ మెంట్లలో భక్తులు ఉన్నారు. 
 
సర్వదర్శనం టోకెన్లు లేని భక్తులకు 8 గంటల్లోనే శ్రీవారి దర్శనం పూర్తవుతోంది. ఇక, రూ.300 టికెట్లు కలిగిన వారికి ప్రత్యేక ప్రవేశ దర్శనానికి మూడు గంటల సమయం పడుతోంది.