బుధవారం, 1 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జె
Last Modified: మంగళవారం, 31 డిశెంబరు 2019 (19:56 IST)

అత్త కూతురితో పెళ్ళి, అత్తతో శారీరక సంబంధం.. ఆ విషయం తెలిసి?

పిల్లనిచ్చిన అత్త వేధింపులు తాళలేక ఓ వ్యక్తి బలవన్మరణానికి పాల్పడిన ఘటన ప్రకాశం జిల్లాలో వెలుగుచేసింది. త్రిపురాంతకం మండలం కొత్త ముడివేముల గ్రామానికి చెందిన అరిపిరాల రవిశంకర శర్మ కురిచేడు రైల్వే స్టేషన్ సమీపంలో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. సంఘటనా స్థలంలో పోలీసులు స్వాధీనం చేసుకున్న లేఖలో అనేక కోణాలను పోలీసులు గుర్తించారు.  
 
అరిపిరాల రవిశంకరశర్మ త్రిపురాంతకం మండలంలోని కొత్త ముడివేముల గ్రామం. ఈయన గుంటూరులో డిగ్రీ చదివే రోజుల్లో అక్కడ గుళ్ళపల్లి మారుతి దేవి అనే వివాహితతో అక్రమ సంబంధం ఏర్పడింది. ఈ విషయం తెలుసుకున్న రవిశంకరశర్మ తల్లిదండ్రులు దోర్నాలకు చెందిన యువతితో అతనికి వివాహం చేశారు. అయితే తమ సంబంధానికి ఆమె అడ్డొస్తుందంటూ విడాకులు ఇప్పించింది.
 
అంతటితో ఊరుకోకుండా కొద్దిరోజులకే మంచి సంబంధమని తన కూతురిని నమ్మించి అతడికిచ్చి పెళ్లి చేసింది. వారికి ముగ్గురు సంతానం కలిగిన తర్వాత మారుతి దేవి అల్లుడిని పట్టించుకోకుండా సముద్రాల రామాచారి అనే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుని హైదరాబాదుకు మకాం మార్చింది. అత్త దూరం కావడంతో రవిశంకరశర్మ మనస్తాపానికి గురై భార్యాపిల్లలను పట్టించుకోవడం మానేశాడు. తన భర్తకు తల్లితో ఉన్న అక్రమ సంబంధం గురించి అతడి భార్యకు తెలిసింది. 
 
దీంతో దంపతుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. కుటుంబ కలహాలతో విసిగిపోయిన రవిశంకరశర్మ కురిచేడు రైల్వేస్టేషన్‌ సమీపంలో ఆత్మహత్య చేసుకున్నాడు. పట్టాలపై మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు అక్కడికి చేరుకుని పరిశీలించారు. మృతుడి చొక్కా జేబులో లభించిన లేఖ ఆధారంగా వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గుంటూరు జిల్లా నరసరావుపేట ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.