1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సందీప్
Last Updated : మంగళవారం, 31 డిశెంబరు 2019 (11:40 IST)

అమితాబ్ బచ్చన్ తర్వాత సల్మాన్ ఖాన్‌కే ఆ ఘనత సొంతం.. ఏంటది?

బాలీవుడ్‌లో అమితాబ్ బచ్చన్ తర్వాత రికార్డు సొంతం చేసుకున్న ఘనత సల్మాన్ ఖాన్‌కు మాత్రమే దక్కింది. సల్మాన్ ఖాన్ 1988లో ‘బీవీ హోతో ఐసీ’ సినిమాతో నటుడిగా బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత సూరజ్ ఆర్. బర్జాత్యా డైరెక్షన్‌లో చేసిన ‘‘మైనే ప్యార్ కియా’’తో స్టార్ హీరోగా వెలిగిపోయాడు. ఈ సినిమాలో సల్మాన్ ప్రేమ్ క్యారెక్టర్‌లో ఇమిడిపోయాడు. 
 
ఇదే సినిమాను తెలుగులో ‘ప్రేమ పావురాలు’గా డబ్ చేస్తే ఇక్కడ కూడా భారీ హిట్ కొట్టింది. ఆ తర్వాత మరోసారి సూరజ్.ఆర్.బర్జాత్యా దర్శకత్వంలో చేసిన ‘హమ్ ఆప్ కే హై కౌన్’ సినిమాలో మరోసారి ప్రేమ్ పాత్రతో అలరించాడు. ఈ చిత్రం భారతీయ చలన చిత్ర పరిశ్రమలోనే  ఒక క్లాసిక్‌గా నిలిచిపోయింది.

ఆ తర్వాత సూరజ్ బర్జాత్యా డైరెక్షన్‌లో చేసిన మూడో సినిమా ‘‘హమ్ సాథ్ సాథ్ హై’’లో మరోసారి ప్రేమ్ క్యారెక్టర్ చేసి హిట్టును అందుకున్నాడు. ఆ తర్వాత నాలుగోసారి సూరజ్.ఆర్.బర్జాత్యా దర్శకత్వంలో చేసిన ‘ప్రేమ్ రతన్ ధన్ పాయో’ సినిమాలో ప్రేమ్ పాత్రతో ఆడియన్స్‌కు ప్రేమను పంచాడు.
 
తాజాగా సల్మాన్ ఖాన్ సూరజ్ ఆర్.బర్జాత్యా దర్శకత్వంలో మరోసారి ప్రేమ్ పాత్రలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. మొత్తంగా ప్రేమ్ పాత్ర చేసిన ప్రతిసారి సల్మాన్ ఆడియన్స్ మనుసులు దోచుకున్నాడు. 
 
ఒక్క సూరజ్ ఆర్. బర్జాత్యా దర్శకత్వంలో చేసిన సినిమాలలోనే కాక ‘అందాజ్ అప్నా అప్నా’, ‘జుడ్వా’, ‘దీవానా మస్తానా’, ‘బీబీ నెంబర్ 1, సిర్ఫ్ తుమ్’, ‘ఛల్ మేరే భాయి’,‘కహా ప్యార్ నా హో జాయే’’, నో ఎంట్రీ, పార్ట్‌నర్, మేరీ గోల్డ్, ‘రెడీ’ వంటి సినిమాల్లో 15 సార్లుకు పైగా ప్రేమ్ క్యారెక్టర్ చేసి మెప్పించాడు. బాలీవుడ్‌లో అమితాబ్ తర్వాతి తరంలో ఒక కథానాయకుడు ఇన్ని సార్లు ఒకే పేరుతో నటించడం రికార్డ్‌గానే చెప్పాలి.