శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By శ్రీ
Last Modified: గురువారం, 6 ఆగస్టు 2020 (21:17 IST)

మహిళను పాము కరిస్తే, ఆమెను అక్కడే పెట్టి వాదించుకున్న 108 సిబ్బంది

శ్రీకాకుళం జిల్లాలో 108 సిబ్బంది నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలైంది. పాము కాటుకు గురైన మహిళను శ్రీకాకుళం తరలించేందుకు రెండు 108 వాహనాల సిబ్బంది మధ్య తలెత్తిన వివాదం వల్ల ఒక ప్రాణం పోయింది. ప్రాణాలను కాపాడేందుకు ప్రయత్నించకుండా గంటపాటు వాదించుకున్న రెండు 108 వాహనాల సిబ్బంది వ్యవహారంపై కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
 
మృతురాలు ఇచ్ఛాపురం మండలం ముచ్చింద్రకు చెందిన సాడి తులసమ్మ. ఆమె పాము కాటుకు గురైంది. పరిస్థితి విషమించడంతో రిమ్స్‌కు రిఫర్ చేశారు ఇచ్ఛాపురం ప్రభుత్వాసుపత్రి సిబ్బంది. 
ఇచ్ఛాపురం 108 వాహనాన్ని కోవిడ్ పేషెంట్లకు కేటాయించడంతో కవిటి నుంచి వాహనాన్ని పిలిపించారు ఆసుపత్రి సిబ్బంది.

అయితే తాము వుండగా కవిటి నుంచి మరో వాహనం ఎలా వస్తుందంటూ 108 వాహనాల సిబ్బంది వాగ్వాదంతో మూడు గంటల పాటు వైద్యం అందకపోవడంతో తులసమ్మ మృతి చెందింది.