శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Modified: సోమవారం, 29 జులై 2019 (17:28 IST)

పెళ్లయినా నువ్వే నాక్కావాలి... ప్లీజ్ ఒప్పుకో, కాదన్నందుకు ఆ యువకుడు ఏం చేశాడంటే...

పెళ్లయిన మహిళను ప్రేమించాడతడు. తన ఇంటికి సమీపంలో వుంటున్న ఆమె బంధువవుతుంది. దీనితో అప్పుడప్పుడు వారి ఇంటికి వెళ్లి వస్తుండేవాడు. ఈ క్రమంలో ఆమెను చూసి మోజులో పడ్డాడు. ప్రేమించాననీ, నీతో దాంపత్య సుఖాన్ని చవిచూడాలని తన మనసులో వున్న కోర్కెను బయటపెట్టాడు. ఆమె ససేమిరా అనడంతో ఆత్మహత్య చేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. 
 
పూర్తి వివరాల్లోకి వెళితే.... వెంకట రమణయ్య అనే యువకుడు నెల్లూరు జిల్లా సంగం మండలం మర్రిపాడు గ్రామ నివాసి. ఇతడు కూలీ పనులు చేసుకుంటూ వుండేవాడు. అవివాహితుడైన రమణయ్య తన తల్లిదండ్రులతో కలిసి వుంటున్నాడు. ఐతే తమ ఇంటికి సమీపంలో వున్న, వరుసకు బంధువయ్యే వివాహితపై మోజు పడ్డాడు. 
 
27 తేదీ జూలై శనివారం మధ్యాహ్నం తన మనసులోని కోరికను బయటపెట్టాడు. తన కోర్కె తీర్చాలని అభ్యర్థించాడు. పెళ్లయినా సరే తనతో సంబంధం పెట్టుకోవాలని వత్తిడి చేశాడు. ఆ మాటలకి ఆమె ససేమిరా అంది. విషయాన్ని పెద్దల దృష్టికి తెస్తానని చెప్పేసరికి అతడు మనస్తాపంతో విషపు గుళికలు మింగి ఆత్మహత్య చేసుకున్నాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.