గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జె
Last Modified: శుక్రవారం, 12 ఏప్రియల్ 2019 (20:25 IST)

ఆమెను నేనే గర్భవతిని చేశా... పెళ్లాడుతానని చెప్పి జంప్...

ప్రేమ పేరుతో మోసపోయే వారి సంఖ్య పెరిగిపోతోంది. ప్రేమించిన తరువాత ప్రేమికుడిని నమ్మి కొంతమంది సర్వం అర్పిస్తుంటారు. అయితే తమ కోరికలు తీరిపోయాక కొంతమంది యువకులు ముఖం చాటేస్తున్నారు. అలాంటి సంఘటనే  చిత్తూరు జిల్లాలో చోటుచేసుకుంది. 
 
చిత్తూరుజిల్లా వి.కోట సమీపంలోని బైరెడ్డిపల్లిలో ఇంటర్ రెండవ సంవత్సరం చదువుతున్న ఒక విద్యార్థినిని అదే ప్రాంతానికి చెందిన ఉదయ్ కుమార్ ప్రేమ పేరుతో నమ్మించాడు. సంవత్సరం పాటు ఆమెను ప్రేమించానన్నాడు. వెంట పడ్డాడు. దీంతో ఆ యువతి కూడా నమ్మింది. ఆ యువతికి మాయమాటలు చెప్పి శారీరక సంబంధం పెట్టుకున్నాడు. ప్రస్తుతం ఆ యువతి నాలుగు నెలల గర్భిణి.
 
అయితే గత వారంరోజుల క్రితం ఉదయ్ కుమార్‌కు తమ బంధువుల అమ్మాయితో తల్లిదండ్రులు నాగరాజుకి వివాహాన్ని నిశ్చయించారు. నిన్న వివాహం జరగాల్సి ఉంది. అన్ని ఏర్పాట్లు చేసేసుకున్నారు. నిన్న రాత్రి విషయం తెలుసుకున్న యువతి ఉదయ్ కుమార్ పెళ్ళి మండపం వద్దకు వెళ్ళి నిలదీసింది.

గ్రామపెద్దల సమక్షంలో ఉదయ్ బాగోతాన్ని బయటపెట్టింది. దీంతో వివాహాన్ని ఆపేశారు. గర్భవతిని చేసుకున్న యువతినే పెళ్ళి చేసుకుంటానని ఉదయ్ చెప్పడంతో గ్రామ పెద్దలు సైలెంట్ అయ్యారు. అయితే ఈ రోజు ఉదయం నుంచి ఉదయ్ ఇంట్లో కనిపించలేదు. దీంతో యువతి తల్లిదండ్రులు పోలీసులు ఫిర్యాదు చేశారు.