శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By మోహన్
Last Updated : మంగళవారం, 30 ఏప్రియల్ 2019 (14:07 IST)

అతిగా వ్యాయామం చేసి ప్రాణాలు పోగొట్టుకున్నాడు..

అతిగా వ్యాయామం చేయడం వల్ల ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన హైదరాబాద్ ఎస్ఆర్ నగర్‌లోని ఓ జిమ్ సెంటర్‌లో చోటుచేసుకుంది. పంజాబ్ రాష్ట్రానికి చెందిన ఆదిత్య అనే యువకుడు ప్రైవేట్ కంపెనీలో డిజిటల్ మార్కెటింగ్ జాబ్ చేస్తున్నాడు. సోమవారం నాడు జిమ్ చేసి రూమ్‌కి వెళ్లిన తర్వాత ఛాతి నొప్పిరావడంతో జిమ్ నిర్వాహకులు ఆదిత్యకు టాబ్లెట్ ఇచ్చారు. 
 
టాబ్లెట్ వేసుకున్న ఆదిత్య పరిస్థితి మరింత క్షీణించింది. దీంతో అక్కడున్న వారు ఆస్పత్రికి తరలించారు. అయితే అతను అప్పటికే చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. ఆదిత్య మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు. స్నేహితుల అందించిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేపట్టారు.