గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 6 అక్టోబరు 2022 (10:31 IST)

ఫేస్‌బుక్ పరిచయం.. సత్యసాయి జిల్లాలో యువతి ఆత్మహత్య

single woman
ఫేస్‌బుక్ పరిచయం ఓ యువతి ప్రాణాలను బలి తీసుకుంది. తాజాగా ఎఫ్‌బీ ద్వారా వేధింపులకు గురైన యువతి వేధింపులు తాళలేక ఆత్మహత్యకు పాల్పడింది. వివరాల్లోకి వెళితే.. సత్యసాయి జిల్లా తనకల్లు మండలంలోని ఓ గ్రామానికి చెందిన యువతి (18) ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. 
 
నల్లచెరువుకు చెందిన యువకుడు ఫేస్‌బుక్‌లో పరిచయమై వేధిస్తున్నాడని.. తన చావుకు అతనే కారణమని యువతి సెల్ఫీ వీడియోలో తెలిపింది. ఈ విషయం తెలిసి తన తల్లిదండ్రులు ఎంతో బాధపడుతున్నారని పేర్కొంది. 
 
అనంతరం ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ మేరకు కుటుంబ సభ్యులు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. యువతి తీసుకున్న సెల్ఫీ వీడియో వైరల్‌గా మారింది.