శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : ఆదివారం, 25 ఆగస్టు 2019 (11:59 IST)

ఆధార్ నమోదుకు తొందరవద్దు.. ప్రభుత్వం

ఆధార్‌, కేవైసీ నమోదుపై ప్రజలు ఆందోళనకు గురైనఘటనలు రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి వచ్చాయి. ఆధార్ అప్‌డేట్‌ కోసం ప్రజలెవ్వరూ ఆందోళన, ఆదుర్దా పడాల్సిన అవసరంలేదు. ఎలాంటి ఇబ్బంది లేకుండా నిదానంగా వాటిని అప్‌డేట్‌ చేయించుకోవచ్చని పేర్కొంది. ఎలాంటి గడువు లేదని పేర్కొంది. 
 
స్కూలు పిల్లల ఆధార్‌ బయోమెట్రిక్‌ తాజా వివరాల నమోదుకు ఆధార్ కేంద్రాలు, బ్యాంకులు, మీ సేవ కేంద్రాలు, పోస్టాఫీసుల వద్దకు వెళ్ళనవసరం లేదని తెలిపింది. రానున్న రోజుల్లో స్కూలు పిల్లలు చదువుతున్న పాఠశాలలు, అంగన్‌వాడీ సెంటర్లకు ప్రభుత్వమే ప్రత్యేక బృందాలను పంపిస్తుందని వెల్లడించింది. అక్కడే ఆధార్ వివరాలు అప్‌డేట్‌ చేయించుకోవచ్చని వెల్లడించింది. ఈ-కేవైసీ అప్‌డేట్‌ చేయనంత మాత్రాన రేషన్ సరుకులను తిరస్కరించడం అంటూ ఉండదని స్పష్టం చేసింది. 
 
ఎక్కడైతే రేషన్‌ తీసుకుంటున్నారో అక్కడ మాత్రమే ఈ-కేవైసి చేసుకోవచ్చని తెలిపింది. ఈ-కేవైసి కొరకు ఆధార్ కేంద్రాలు, బ్యాంకులు, మీ సేవ కేంద్రాల వద్దకు వెళ్ళ కూడదని వెల్లడించింది. ఇదివరకు రేషన్ దుకాణం వద్ద కేవైసి చేయించుకొని ఉంటే మరల చేయించవలసిన అవసరం లేదని స్పష్టం చేసింది. 
 
ప్రజలు ఆందోళనకు గురికావొద్దని, ఆధార్ కేంద్రాలు వద్ద, మీ సేవ కేంద్రాల వద్ద, పోస్టాఫీసుల వద్ద పడిగాపులు పడొద్దని విజ్ఞప్తి. అధికారులు, వాలంటీర్లు, ఉద్యోగులు, మీడియా సంస్థలు ఈ అంశాన్ని ప్రజలకు వివరించాలని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కార్యదర్శి కోన శశిధర్ విడుదల చేసిన పత్రికా ప్రకటనలో పేర్కొంది.