శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By kumar
Last Modified: శుక్రవారం, 2 జూన్ 2017 (15:35 IST)

ఏపీలో ఆవులు, ఎద్దులకు ఆధార్ నెంబర్లు... ఆ గిత్తల కోసమేనట...

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరో హైటెక్ కార్యక్రమానికి తెర తీశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఆవున్నింటికీ ఆధార్ నంబర్లు కేటాయించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ ర

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరో హైటెక్ కార్యక్రమానికి తెర తీశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఆవున్నింటికీ ఆధార్ నంబర్లు కేటాయించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి రాజధాని అమరావతిలోని పశువుల ఆసుపత్రి నుండి ప్రారంభించనున్నారు.
 
రాష్ట్రంలోని ఆవులు అన్నింటికీ ఆధార్ నంబర్లను కేటాయించి, ఆ నంబర్లను వాటి యజమానులు లేదా రైతుల ఆధార్ నంబర్లతో అనుసంధానిస్తారు. దీనివల్ల రాష్ట్రంలోని ఆవుల సంఖ్య తేలటమే కాకుండా వాటి వయసు, లింగం, ఏ జాతి ఆవులు ఎన్ని ఉన్నాయనే వివరాలు అందుబాటులో ఉంటాయి. అలాగే ప్రభుత్వ వైద్యశాలల్లో ఆవులకు అందించే చికిత్స వివరాలను తెలుసుకునే అవకాశం ఉంటుంది, పశువుల కదలికలను తెలుసుకునేందుకు అధికారులకు సులువుగా ఉంటుంది.
 
ఆంధ్రప్రదేశ్‌లో దాదాపు 10 మిలియన్ల పశువులు ఉన్నట్లు సమాచారం ఉంది. వీటిలో పుంగనూరు ఆవులు, ఒంగోలు గిత్తలకు ప్రత్యేకత ఉంది. ఈ అరుదైన జాతుల్ని కాపాడేందుకు ఈ కార్యక్రమం సహాయపడుతుందని ప్రభుత్వం భావిస్తోంది.