గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 2 మే 2023 (19:53 IST)

రూ.20వేలు అప్పు తీసుకుని వడ్డీ కట్టలేదు.. యాసిడ్ దాడి

Acid attack
రూ.20వేలు అప్పు తీసుకున్న మహిళపై యాసిడ్‌పై దాడి జరిగింది. అప్పు, వడ్డీ చెల్లించాలంటూ అప్పు ఇచ్చినట్లు పలుమార్లు అడిగాడు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా అప్పు తీర్చ లేకపోయింది.  దీంతో ఆగ్రహానికి గురైన అప్పు ఇచ్చి వ్యక్తి ఆమె ఇంటికి వెళ్లి యాసిడ్ దాడి చేశాడు. కుటుంబ సభ్యులు వచ్చేలోపు  దుండగుడు పారిపోయాడు.ఈ ఘటనలో విజయవాడ, పెడనలో దారుణం జరిగింది. 
 
20వ వార్డులోని రామలక్ష్మి కాలనీలో మోకా కరుణ కుమారిపై ఓ వ్యక్తి యాసిడ్ తో దాడి చేశాడు. ఈఘటనలో ఆమెకు తీవ్ర గాయాలైనాయి. ఓ కంపెనీలో పనిచేసే బాధితురాలు గడువులోపు అప్పు తీర్చలేకపోయింది. ఐదు రూపాయల వడ్డీ కింద 20వేల రూపాయలు అప్పు చేసింది. వడ్డీ కట్టలేకపోయింది. దీంతో నిందితుడు ఆమెపై యాసిడ్ దాడి చేశాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.