ఆదివారం, 26 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : బుధవారం, 16 మే 2018 (15:10 IST)

ఏపీలో బీజేపీ గెలుపు తథ్యం : హీరో కృష్ణంరాజు జోస్యం

సినీ నటుడు, బీజేపీ సీనియర్ నేతల్లో ఒకరైన కృష్ణంరాజు జోస్యం చెప్పారు. వచ్చేయేడాది ఏపీ అసెంబ్లీకి జరిగే శాసనసభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ తప్పకుండా విజయం సాధిస్తుందన్నారు. ఇక దక్షిణ భారతావనిలో కూడా క

సినీ నటుడు, బీజేపీ సీనియర్ నేతల్లో ఒకరైన కృష్ణంరాజు జోస్యం చెప్పారు. వచ్చేయేడాది ఏపీ అసెంబ్లీకి జరిగే శాసనసభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ తప్పకుండా విజయం సాధిస్తుందన్నారు. ఇక దక్షిణ భారతావనిలో కూడా కాషాయం జెండా రెపరెపలాడుతుందన్నారు.
 
ఆయన బుధవారం కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై స్పందిస్తూ, కర్ణాటకలో ప్రజలు ఇచ్చిన తీర్పుతో తమ పార్టీ ఉత్తర భారతదేశ పార్టీ అనే అపోహ తొలగిపోయిందన్నారు. కర్ణాటకలోని తెలుగు ఓటర్లు అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి సంపూర్ణ మద్దతు ప్రకటించారని అన్నారు.
 
అయితే, ఈ ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకంగా ఓటు వేయాలంటూ టీడీపీ నేతలు చేసిన ప్రయత్నాలు ఫలించలేదన్నారు. వచ్చే ఎన్నికల్లో ఏపీలో బీజేపీ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. కాగా, కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ, కేసీఆర్, చంద్రబాబులు పిలుపునిచ్చినప్పటికీ తెలుగు ప్రజలు బీజేపీకే ఓటు వేశారని అన్నారు.